Movie News

Raamam Raaghavam: డైరెక్టర్ గా మారిన మరో జబర్దస్త్ కమెడియన్.. రామం రాఘవం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్?

Raamam Raaghavam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని ఏళ్ల నుంచి సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తుంది జబర్దస్త్ షో. ఈ జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది ఈ జబర్దస్త్ షో ద్వారా భారీగా పాపులర్ సంపాదించుకోవడంతో పాటు సినిమాలలో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలామంది సినిమాలలో అవకాశాలను అందుకున్న విషయం తెలిసిందే.

జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ వేణు ఇటీవల బలగం సినిమాతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే మరో నటుడు జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ గా మారారు. అతను మరెవరో కాదు ధనరాజ్. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలో నటించి మెప్పించిన ధనరాజ్ ఇప్పుడు డైరెక్టర్ గా మారారు. గత ఏడాది తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాను అనౌన్స్ చేశాడు ధనరాజ్. తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ మూవీకి రామం రాఘవం అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు. ఇందులో సముద్రఖని, ధనరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్..

వీరిద్దరు ఇందులో తండ్రి కొడుకులుగా కనిపించనున్నారని సమాచారం. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ను సరికొత్తగా వెండితెరపై చూపించనున్నట్లు తెలుస్తోంది. విమానం సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృథ్వి, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం కాబోతున్న ధనరాజ్ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago