Movie News

Deepak Saroj : హీరోగా అర్జున్ రెడ్డి రేంజ్ సినిమాతో రాబోతున్న అతడు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్?

Deepak Saroj: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది నటించి ఆ తర్వాత కొన్ని ఏళ్లకు హీరో హీరోయిన్లుగా ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ అలా ఎంతోమంది సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ప్రస్తుతం హీరో, హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు. బలగం సినిమాతో కావ్య హీరోయిన్ గా వరుస సినిమాలు కొట్టేస్తుంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజా సజ్జా నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఇదే కోవలో మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా వచ్చేస్తున్నాడు. అది కూడా ఏకంగా అర్జున్ రెడ్డి రేంజ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.

అతను మరెవరో కాదు మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాలో నటించిన బుడ్డోడు. ఆ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్. సినిమాలో హీరో ఆ ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది ఇతనే. అతడు సినిమాలో దీపక్ చాలా సీన్స్ లో కనిపిస్తాడు. అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొని పలు సినిమాల్లో నటించాడు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. కొత్త డైరెక్టర్ యశస్వి దర్శకత్వంలో దీపక్ సరోజ్ హీరోగా రాబోతున్న సినిమా సిద్దార్థ్ రాయ్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు.

దీపక్ ఖాతాలో హిట్ గ్యారెంటీ..

ఈ ట్రైలర్ చూస్తుంటే అందరికి అర్జున్ రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలే గుర్తుకు వచ్చాయి. ఆ రేంజ్ బోల్డ్, ఎమోషన్ కంటెంట్ తో రాబోతున్నాడు దీపక్. త్వరలోనే సిద్దార్థ్ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నాడు. మరి ఈ సినిమాతో హీరోగా కూడా పేరు తెచ్చుకొని దీపక్ సరోజ్ వరుసగా సినిమాలు చేస్తాడేమో చూడాలి మరి. అంతేకాకుండా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏకంగా ఆ రేంజ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుండడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ ను చూసిన అభిమానులు దీపక్ ఖాతాలో హిట్ గ్యారెంటీ ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago