RGV: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఎవరో ఒకరిపై సంచలన ట్వీట్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆర్జీవి. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలలో కూడా తలదూరుస్తూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు రాంగోపాల్ వర్మ. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలన ట్వీట్లు చేస్తూ ఉంటారు.
ఒకరకంగా చెప్పాలి అంటే రాంగోపాల్ వర్మ దర్శకుడుగా కంటే కాంట్రవర్సీల ద్వారా బాగా హైలెట్ అయ్యారని చెప్పవచ్చు. ఇదంతా మొన్నటి వరకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ చాలా తక్కువగా మాత్రమే సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉండే తాజాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. అసలేం జరిగింది రాంగోపాల్ వర్మ ఆ ట్వీట్ లో ఏం రాసుకోవచ్చారు అన్న విషయానికి వస్తే… దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసి కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకుంది. ఇకపోతే డైరెక్టర్ ఆర్జీవీ కూడా శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే.
శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది..
ఎన్నో వందల సార్లు ఆర్జీవీ ఈ విషయం చెప్పాడు. శ్రీదేవిని ప్రేమించానని, ఆమెని ఎంతగా ఆరాధించానని కూడా తెలిపారు ఆర్జీవి. శ్రీదేవితో కలిసి ఆర్జీవీ రెండు సినిమాలు తీసాడు కూడా. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అప్పుడప్పుడు శ్రీదేవి ప్రస్తావన తన ఇంటర్వ్యూలలో కానీ, సోషల్ మీడియాలో కానీ తీసుకొస్తూ ఉంటాడు. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో తయారుచేసిన ఒక శ్రీదేవి ఫోటోని ఆర్జీవీ షేర్ చేసి.. ఆ ఆర్టిఫిషియాల్ ఇంటిలిజెన్స్ శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది అని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో శ్రీదేవి చాలా అందంగా ఉండటంతో ఆర్జీవికి శ్రీదేవి గుర్తొచ్చి ఏడ్చాడు అనే అర్ధంలో పోస్ట్ చేసాడు. దీంతో ఆర్జీవీ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నీకు కూడా ఏడుపు వస్తుందా!ఏం తాగి పోస్ట్ చేశావా అంటూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…