Saindhav: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైంధవ్. ఈ సినిమాకు డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. కాగా ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ మూవీ జనవరి 13న సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఓపెనింగ్స్ లేకపోయినా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ యాక్షన్ , ఫ్యామిలీ డ్రామా మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన సైంధవ్ జనవరి 13న రిలీజైంది. వసూళ్ల పరంగా భారీగా కాసులు కురిపించకపోయినప్పటికి వెంకీ మార్క్ సక్సెస్ ని మాత్రం సొంతం చేసుకుంది. కూతురు సెంటిమెంట్ తో సాగిన ఈ సినిమాలో వెంకటేష్ నటన అద్భుతంగా ఉందని ఆడియన్స్ మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
సుమారు 15కోట్లతో రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి కనీసం నెల రోజులు కూడా కాకముందే అప్పుడే ఓటీటీ విడుదల కాబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఓటీటీ డేట్ కూడా ఫిక్స్ అయిందట. వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఫిబ్రవరి మొదటి వారంలో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత, దర్శకుడు, హీరో ఊహించిన స్థాయిలో ఈసినిమాపై థియేటర్ లో రెస్పాన్స్ రాలేదు. మరి ఓటీటీలో అయినా వస్తుందో లేదో చూడాలి మరి.
స్ట్రీమింగ్ అప్పటినుంచే..
వెంకటేష్ ఫ్యామిలీ మెన్, యాక్షన్ హీరోగా రెండు యాంగిల్స్ ను ఈసినిమాలో చూపించినప్పటికి ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. సైంధవ్ సినిమా ఫిబ్రవరి 2వ తేది లేదా 9న కాని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వస్తుందని తెలుస్తోంది. అయితే స్టార్ హీరో వెంకటేష్ సినిమా విడుదల అయి నెలరోజులు కూడా కాకుండా ఓటిటిలోకి వస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…