Movie News

Rajinikanth: రజనీకాంత్ జైలర్ సీక్వెల్ లో నటించబోతున్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Rajinikanth: టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు రజినీకాంత్. అంతేకాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు రజనీకాంత్. ఇక రజనీకాంత్ చివరగా జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార మరోసారి జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆయన అతిథి పాత్ర పోషించిన లాల్‌ సలాం చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన తెరపైకి రానుంది. ఆయన పెద్దకూతురు ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణువిశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. కాగా ప్రస్తుతం జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ వేట్టైయాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మలయాళం స్టార్‌ హీరోయిన్‌ మంజు వారియర్‌ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా రజనీకాంత్‌ తన 171వ చిత్రాన్ని లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.

రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్..

ఈ చిత్ర షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. కాగా రజనీకాంత్‌ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్త తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈయన ఇంతకుముందు నటించిన జైలర్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్‌ను దర్శకుడు నెల్సన్‌ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన సరసన నటి నయనతార నటించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ జంట చంద్రముఖి, కథానాయకుడు, శివాజీ, దర్భార్‌, అన్నాత్తే మొదలగు ఐదు చిత్రాలలో కలిసి నటించింది. తాజాగా ఆరోసారి ఈ కాంబోలో చిత్రం రూపొందబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago