Movie News

Sreemukhi: ఆ విషయంలో అనసూయకు పోటీ ఇస్తున్న యాంకర్ శ్రీముఖి.. తగ్గేదేలే అంటూ?

Sreemukhi: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు యాంకర్ శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఉన్న టాప్ యాంకర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు ప్రస్తుతం తెలుగులో ఎన్నో షో లకు, ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది. ఏ షోలో చూసిన, ఏ ఈవెంట్ లో చూసిన కూడా శ్రీముఖి పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా శ్రీముఖి చేసే అల్లరి ఆమె ఎనర్జీకి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పవచ్చు.

ఒకవైపు యాంకర్ గా అల్లరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. కాగా మూడు పదుల వయసు దాటినా కూడా ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాను బాగా వాడుకోవడంలో అనసూయ ముందు వరుసలో ఉంటుంది. చిన్నితెరపై జబర్దస్త్ వేదికగా భారీ పాపులారిటీ కూడగట్టుకున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్ తో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తూ ఉంటుంది.

అయితే మరో యంగ్ యాంకర్ శ్రీముఖి కూడా అనసూయ బాటలోనే తగ్గేదే లే అంటోంది. ఇంకా చెప్పాలంటే అందాల ఆరబోత విషయంలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేయడంలో యాంకర్ శ్రీముఖి అనసూయకు గట్టి పోటీని ఇస్తోంది. కొన్ని కొన్ని సార్లు అనసూయ అందాన్ని బీట్ చేస్తూ తన గ్లామర్ తో యువతను ఆకట్టుకుంటోంది శ్రీముఖి. దీంతో తమను తాము ప్రమోషన్ చేసుకోవడంలో అనసూయకు శ్రీముఖి గట్టి పోటీ ఇస్తోందని నెటిజన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ అలరిస్తూనే అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తోంది.

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీముఖి..

తాజాగా సోషల్ మీడియాలో శ్రీముఖి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె చాలా అందంగా కనిపించడంతోపాటు తన చూపులతోనే యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. మత్తెక్కింతే చూపులతో యువతను రెచ్చగొడుతోంది. డిఫరెంట్ లుక్ లో ఓల్డ్ కాస్ట్యూమ్స్ ను ధరించిన ఈమె అందంగా కనిపించడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రోజురోజుకీ శ్రీముఖి అందం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోస్ చూసేయండి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago