నరకం చూపించిన ఖుష్ బూ తండ్రి.. ఆ కష్టాలు పగవాడికి కూడా రావద్దు..

ఖుష్‌బూ అంటే తెలియని వాళ్లకు కూడా 1991 సంవత్సరంలో అందరికీ తెలిసిపోయింది. తమిళంలో ఆమె నటించిన చిత్రం ‘చిన్నతంబి’ అప్పట్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. దీంతో ఆమెకు విపరీతంగా అభిమానులు అయ్యారు. గుడులు కూడా కట్టారు. రక్తంతో ఉత్తరాలు కూడా రాశారు. త‌మిళ ద‌ర్శ‌కుడు సి. సుంద‌ర్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్ద‌రు కుమార్తెలు.. అవంతిక‌, ఆనందిత‌. అయితే చిన్నతనంలో ఖుష్ బూ ఎన్నో కష్టాలను అనుభవించింది.

తండ్రి చేతుల్లో చాలా హింస ఎదుర్కొన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె తల్లిని కూడా ఎక్కువగా హింసించేవాడు. అందుకే తండ్రి అంటే ఖుష్ బూకు ద్వేషం ఎక్కువగా ఉండేది. తన తండ్రిని చూసి ఆమె 35 ఏళ్లు అయిందంట. దీనిని బట్టే అర్థం అవుతుంది..తండ్రి అంటే ఖుష్ బూకు ఎంత ద్వేషమో. ఖుష్ బూ అసలు పేరు ‘నఖత్ ఖాన్’. న‌ఖత్ అంటే ఉర్దూలో సువాస‌న అని అర్థం. హిందీలో దానికి అర్థం ఖుష్‌బూ. అందుకే ఖుష్‌బూ అనే పేరు పెట్టారు.

1978 సంవత్సరంలో ద బ‌ర్నింగ్ ట్రైన్ చిత్రంలో బాలనటిగా కేరీర్ ను మొదలు పెట్టారు. అప్పట్లో ఆమె సంపాదించిన డబ్బుతో తండ్రి ఆనందం చెందేవాడు. డబ్బు లేకపోతే ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు.. వాళ్ల తల్లికి.. ఖుష్ బూ కు నానా నరకం చూపించేవాడు. అందుకే ఆమె తండ్రి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడదు. ఒక్కోసారి షూటింగ్ లో ఉన్న సమయంలో సెట్స్ మీద‌కు వ‌చ్చి అంద‌రి ముందే కొట్టేవాడ‌ని ఖుష్‌బూ చెప్పారు. డబ్బు విలువ తెలుసుకున్న ఖుష్ బూ వాళ్ల తండ్రిని 16 ఏళ్ల వయస్సులో అడిగేసింది. డబ్బులు ఏం చేస్తున్నావు అని..దీంతో కోపం తెచ్చుకున్న వాళ్ల తండ్రి ముంబై నుంచి చెన్నైకు తీసుకొని వ‌చ్చాడు. అప్పుడే ‘క‌లియుగ పాండ‌వులు’ సినిమా చేస్తోంది.

ఆర్‌.ఎ. పురంలోని 6వ రోడ్డులో ఓ అద్దె ఇంట్లో వాళ్ల‌ను దించేసి, తండ్రి ముంబై వెళ్లిపోయాడు. వెళ్తూ.. వెళ్తూ ఖుష్ బూ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులను అన్నీ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ బాధ్యత అంతా ఆమె చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక తండ్రితో సంబంధం లేకుండా సినిమా చేస్తూ.. రెమ్యూన‌రేష‌న్ అమౌంట్‌ను జగ్రత్తగా దాచుకునేది. ఓ రోజు చెన్నైలో వాళ్లు నివాసం ఉంటున్న ఇంటికి వచ్చిన తండ్రికి కొత్త కారు కనిపించింది. అతడు కోపంతో దాని విండ్‌షీల్డ్‌ను ప‌గ‌ల‌గొట్టాడు. ముంబైకి మళ్లీ నా అవసరం కోసం వస్తావు.. అని తండ్రి అంటే.. ఇంట్లో వాళ్లను చంపి నేను చస్తాను కానీ.. నీ దగ్గరకు అస్సలు రానే రాను అంటూ చెప్పింది ఖుష్‌బూ. ఆ రోజు నుంచి తండ్రి మొహం చూడనే లేదు.