గత కొన్ని సంవత్సరాల నుంచి బుల్లి తెర పై ప్రసారం అవుతూ అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంటున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు తమ కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఈ విధంగా ఎంతో మంది సామాన్య ప్రజలను సెలబ్రిటీలుగా మార్చిన వేదిక జబర్దస్త్ అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భార్య భర్తల మధ్య జరిగే సన్నివేశాలు, ప్రేమికుల మధ్య జరిగే సన్నివేశాలను ఎక్కువగా చూపిస్తుంటారు.
గతంలో ఈ కార్యక్రమంలో కేవలం మగవారు మాత్రమే ఉండేవారు. ఈ క్రమంలోనే మగవారి ఆడవారి వేషధారణలో నటించేవారు. కానీ జబర్దస్త్ కార్యక్రమంలో చమ్మక్ చంద్ర స్కిట్లు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎక్కువగా చమ్మక్ చంద్ర భార్య భర్తల మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించిన స్కిట్ లను చేసేవాడు. ఈ క్రమంలోనే తన స్కిట్ లో భాగంగా బుల్లితెర నటి సత్యశ్రీ ని జబర్దస్త్ వేదికపైకి తీసుకువచ్చారు.
కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన సత్యశ్రీ కు అక్కడ తగినంత గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర తనని జబర్దస్త్ వేదికపైకి తీసుకురావడంతో జబర్దస్త్ రూపురేఖలే మారిపోయాయని చెప్పవచ్చు. జబర్దస్త్ వేదికగా తన టాలెంట్ నిరూపించుకున్న సత్య శ్రీ జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర వెళ్ళిపోగానే తను కూడా వెళ్ళిపోయింది.
అయితే సత్య శ్రీ ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఆ తర్వాత పలువురు జబర్దస్త్ టీమ్ లీడర్స్ తమ స్కిట్ లలో భాగంగా లేడీ కమెడియన్ రోహిణి, వర్ష, పవిత్ర వంటివారు జబర్దస్త్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా సత్య శ్రీ ఎంట్రీ ఇవ్వడం ద్వారా జబర్దస్త్ వేదిక కలర్ ఫుల్ గా మారిందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…