Movie News

అప్పట్లో మురళీమోహన్, జయచిత్ర లకు ఒక పాపులర్ దినపత్రిక పెళ్లి చేసిందని మీకు తెలుసా ?!

గత కొన్ని దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో మురళీమోహన్, జయచిత్రకు ఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్దరు జంటగా ఎన్నో సినిమాలలో కలిసి నటించడంతో ఈ జంట ఎంతో పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ జంట బయట కనిపిస్తే చాలు వీరిపై ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎక్కడ చూసిన ఈ జంట కనిపించడంతో వీరిపై అనుమానాలు మరింత బలపడ్డాయి.

షూటింగ్ నిమిత్తం మద్రాసులోని వాహినీ స్టూడియోకి మురళీమోహన్ వెళ్లగానే అక్కడున్న వారందరూ అతనిని చూసి “ఇవ‌ర్‌దా (ఇత‌నే) మురళీమోహన్” అని అనుకుంటున్నారు.అయితే వాళ్లు అందరూ తన గురించి అలా ఎందుకు అంటున్నారో అర్థం కాక మురళీమోహన్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే షూటింగ్ నిమిత్తం సెట్లోకి అడుగు పెట్టగానే సహ నటీనటులు మొత్తం నిజం చెప్పు.. నువ్వు జయ చిత్రను పెళ్లి చేసుకుంటున్నావా? అని అడిగారు.. అందుకు మురళీమోహన్ స్పందిస్తూ నేను జయచిత్రను పెళ్లి చేసుకోవడం ఏంటి?నాకు ఇదివరకే పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారని సమాధానం చెప్పాడు.

అదే విధంగా మురళీమోహన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు షూటింగ్ లొకేషన్ కి వచ్చి, “బాబూ నీతో ఓసారి మాట్లాడాలి. బ‌య‌ట‌కు రా” అని పిలవగానే మురళీమోహన్ ఎందుకో డౌట్ పడుతూ అతని దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలోనే మురళీమోహన్ తో మాట్లాడుతూ ఈ రోజు పేపర్లో వచ్చింది చూసావా.. నువ్వు, జయచిత్ర పెళ్లి చేసుకోబోతున్నారట నిజమేనా? నువ్వు తప్పు చేయవనే నమ్మకం నాకు ఉంది ఒకవేళ తప్పటడుగులు వేస్తున్నవేమో నిన్ను హెచ్చ‌రిద్దామ‌ని వ‌చ్చాను.” అన్నారు.

అప్పుడు మురళీమోహన్ అలాంటి తప్పు నేను ఎప్పుడు చేయను.. ఒకరి దగ్గర తలదించుకునే అవకాశాన్ని రానివ్వనని చెప్పడంతో పూర్ణచంద్రరావు ఎంతో సంతృప్తి చెందాడు. ఇలా పేపర్లో ఆ వార్త రావడంతో ఎంతో బాధ పడిన మురళీమోహన్ ఆ వార్త రాసినటువంటి ఎంతో పాపులర్ అయిన దిన‌తంతి అనే డైలీ పేప‌ర్‌. ఫ్రంట్ పేజీలోనే ప్ర‌ముఖంగా ఆ వార్త‌ను వేశారు. దీంతో ఆ దినపత్రికకు మురళీమోహన్ లీగల్ నోటీసులు పంపడంతో సదరు దినపత్రిక ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ వార్తలు రాయడం చేత తిరిగి మురళీమోహన్ కు క్షమాపణలు చెప్పింది.

అయితే ఒక రోజు షూటింగ్ నిమిత్తం దాసరి నారాయణరావుతో కలిసి మురళీమోహన్, జయచిత్ర ఓకే ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి అదే దినపత్రిక అప్పుడు మేము చెప్పినది నిజమే.. దాసరి నారాయణ రావు సమక్షంలో మురళీమోహన్, జయచిత్ర పెళ్లి హైదరాబాద్లో జరగనుందని మళ్లీ అదే పేపర్లో వచ్చింది. నిజానికి దాసరి నారాయణరావు అక్కినేని గారికి కథ చెబుదామని హైదరాబాద్ వచ్చారు. మురళీమోహన్ వడ్డే రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం వచ్చారు. అలాగే జయచిత్ర కూడా వేరే సినిమా షూటింగ్ కోసం వచ్చారు.ఈ విధంగా వేరువేరు పనుల నిమిత్తం ఓకే ఫ్లైట్లో ఈ ముగ్గురు రావడం చేత దిన‌తంతి అనే దినపత్రిక మురళీమోహన్ , జయచిత్రకు ఏకంగా పెళ్లి కూడా చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago