Movie News

సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేక మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామరస్ పాత్రలో నటించకుండా అద్భుతమైన నటనతో అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర సంపాదించుకున్న నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య కన్నడ నటి అయినప్పటికీ అచ్చతెలుగు అమ్మాయిలా ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎనలేని ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె బాలకృష్ణ సరసన కూడా నటించడానికి ఒప్పుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఎన్నో పౌరాణిక చిత్రాలలో నటించి అద్భుతంగా మెప్పించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన కలల ప్రాజెక్ట్ అయినటువంటి “నర్తనశాల” సినిమాకు మొట్టమొదటిసారిగా దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు.ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో పర్ణశాల సెట్ కూడా వేసి ఒక షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.

నర్తనశాల సినిమాలో సౌందర్య ద్రౌపది పాత్ర పోషిస్తోంది.ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత సౌందర్య రాజకీయాలలోకి వచ్చి బిజెపి తరఫున ప్రచారం కోసం బెంగళూరు నుంచి కరీంనగర్ కి ఎయిర్ క్రాఫ్ట్ లో తన అన్నయ్యతో కలసి వస్తుండగా 2004 ఏప్రిల్ 17న విమానం కూలి తన అన్నయ్య అమర్ నాథ్ తో పాటు మరణించారు. ఈ విధంగా సౌందర్య మృతిచెందడంతో నర్తనశాల సినిమా అక్కడితో ఆగిపోయింది.

నిజానికి ఈ సినిమా కేవలం ఒక షెడ్యూల్ షూటింగ్ ను మాత్రమే జరుపుకుంది.ఈ క్రమంలోనే సౌందర్య స్థానంలో మరొక హీరోయిన్ ను తీసుకొని ఈ సినిమాను పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ బాలకృష్ణ సౌందర్య స్థానంలో మరొక హీరోయిన్ ను ఊహించుకోలేక, తన కలల ప్రాజెక్ట్ అయినటువంటి నర్తనశాల సినిమా అంతటితో ఆపివేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago