ఏపీ సీఎంను కలవనున్న కింగ్ నాగార్జున..!

కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. అంతే కాకుండా గత ఏడాదిన్నర కాలంగా సమస్యలలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే పలు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. టిఆర్ఎస్ సమస్య ఆన్లైన్ టికెట్ ధరలు వ్యవహారం తెలుగు సినీ ఇండస్ట్రీనీ గందరగోళం లోకి నెట్టింది. ఈ విషయం పట్ల నిర్మాతలు అలాగే మంత్రి పేర్ని నాని తో భేటీ అవుతూ వస్తున్నారు.

అయినప్పటికీ ఈ టికెట్టు ధర వ్యవహారం కొరికి రావడం లేదు. ఆ మధ్య ఒక సారి సీఎం జగన్ నుంచి చిరంజీవి ఆహ్వానం అందింది. త్వరలోనే సినీ పెద్దలు అలాగే చిరంజీవి నేతృత్వంలో జగన్ భేటీ కాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వీరి భేటీ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూప్రసంగించిన విషయం అందరికి తెలిసిందే.

ఆ తరువాత ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. టాలీవుడ్ సమస్యలపైచర్చలు కూడా జరిగాయి. దీంతో టాలీవుడ్ లో పలువురు నిర్మాతలు పేద నాని ని కలిసి వివాదం సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉండగా నేడు వైయస్ జగన్ తో భేటీ ఎందుకు నాగార్జున అలాగే మరికొంతమంది టాలీవుడ్ నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ ఈ సమావేశానికి చిరంజీవి మాత్రం హాజరు కావడం లేదు.

అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి ఎందుకు హాజరు కావడం లేదు అనేదానిపై కారణాలు తెలియాల్సి ఉంది.నాగార్జున తెలుగు సినీ పరిశ్రమ తరపున జగన్ కు సమస్యలు వివరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈ కార్యక్రమానికి నాగార్జున తో పాటు ప్రీతం రెడ్డి, అలాగే నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. నాగార్జున జగన్ తో భేటీ కావడం వెనుక వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు వినిపిస్తున్నాయి.