టాలీవుడ్ హీరో సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను ప్రస్తుతం హిట్లు, ప్లాపులు అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే మళ్లీ రావా సినిమాతో మంచి హిట్ ను అందుకున్న సమంత తాజాగా మళ్ళీ మొదలైంది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు టీజీపీటీ కిర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే బుల్లితెర యాంకర్ వర్షిని కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. విడాకుల తర్వాత ఒక మగాడి జీవితం ఎలా ఉంటుంది అన్న కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఈ సినిమా ట్రైలర్ ను సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో మొదట టామ్ క్రూయిజ్- నికోల్ కిడ్, బిల్ గేట్స్ – మిలిందా గేట్స్, బ్రాడ్ ఫైట్ – ఏంజిలీనా జోలి జంటలను చూపిస్తూ కొన్ని పెళ్లిళ్లు విడాకులతో ఎండ్ అవుతాయి అంటూ చూపించారు. ఈ సినిమాలో విడాకుల అనంతరం ఒక మగాడు జీవితంలో జరిగిన పరిణామాలు, సానుభూతులు లాంటివి టైలర్ లో చూపించడం జరిగింది.
ఈ సినిమాలో మొదటి భార్య అయినా వర్షిని తో విడాకులు తీసుకున్న తరువాత ఆ కేసులో తన భార్య తరఫున వాదించిన లాయర్ ని చూసి ప్రేమలో పడటం, ఆమెను ప్రేమలో దింపడానికి ప్రయత్నించడం ట్రైలర్ లో చూపించారు. సినిమా న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఈ సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం త్వరలోనే విడుదల చేయనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…