Konda Susmitha Patel : వై ఎస్ షర్మిలను కెసిఆర్ అలా చేసి ఉండకూడదు…: కొండా సుస్మిత పటేల్

Konda Susmitha Patel : వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతులు లేని రాజాకీయం లేదు. నక్సల్ పార్టీ నుండి రాజకీయాల్లోకి వచ్చిన కొండా మురళి, ఆయన భార్య సురేఖ కాంగ్రెస్ పార్టీలో మండల్ పరిషత్ మెంబెర్ నుండి మంత్రి వరకు ఎదిగారు. కొండా మురళిని చంపించాలని చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి. రెండు వర్గాల మధ్య వర్గపోరుతో మురళి మీద హత్యాయత్నం కూడా జరిగింది. ఇక ఈ విషయాలన్నీ ఇటీవల రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ సినిమా తీసి మరీ చూపించాడు. ఇక ఈ సినిమా గురించి రాజకీయాల్లోకి రావడం గురించి కొండా సుస్మిత మాట్లాడారు అలానే వారికి ప్రధాన ప్రత్యర్థి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి అలానే కెసిఆర్ పాలన గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

నీ ఇంటి ఆడబిడ్డకు అలానే చేస్తావా…

తెలంగాణ రాజకీయాల్లోకి రాజన్న బిడ్డగా నేను ప్రజల పక్షాన ఉంటాను అంటూ వైఎస్ షర్మిల పార్టీ పెట్టుకుని ప్రజా కార్యక్రమాలలో పాల్గొంటూ కెసిఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వైఎస్ షర్మిలను కారులో నిర్భంధించి పోలీసులు దౌర్జన్యం చేసారంటూ కొండా సుస్మిత ఆరోపించారు. కెసిఆర్ ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డ ఉంది, తనకు ఇలానే జరిగితే ఎలా ఉంటుంది.

రాజశేఖర్ రెడ్డి కూతురు అని కూడా చూడకుండా ఆమెను ఇబ్బంది పెట్టారు పోలీసులు, ఆమెకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారు. ప్రస్తుతం తెలంగాణలో దొరల పాలన నడుస్తోంది అంటూ విమర్శించారు. కెసిఆర్ కూతురు కవిత జాగృతి పెట్టి బతుకమ్మ ఆడితేనే అదే బతుకమ్మ అనేలా చిత్రికారిస్తున్నారు, అంతకుముందు ఎవరికీ బతుకమ్మ తెలియదు అన్నట్లు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు సుస్మిత పటేల్.