Krishna – Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద 15 పోటీపడిన కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి.. ఎవరు గెలిచారో తెలుసా?

Krishna – Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరు సూపర్ స్టార్, మరొకరు మెగాస్టార్. ఇలా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలా హీరోల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద విడుదల అవుతూ ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడుతుంటుంది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఏకంగా 15 సార్లు బాక్సాఫీస్ వద్ద ఢీ అంటే ఢీఅని పోటీపడ్డారు. ఇలా వీరిద్దరి మధ్య మొట్టమొదటిసారిగా 1984వ సంవత్సరంలోనే మొదలైంది.కృష్ణ నటించిన బంగారు కాపురం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ చిత్రాల మధ్య పోటీ ఏర్పడింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

Krishna – Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద 15 పోటీపడిన కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి.. ఎవరు గెలిచారో తెలుసా?

మరోసారి 1985లో వీరిద్దరి మధ్య పోటీ ఏర్పడింది. కృష్ణ నటించిన అగ్నిపర్వతం,మెగాస్టార్ చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం సినిమాల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.ఈ రెండు సినిమాలలో అగ్నిపర్వతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినగా చట్టంతో పోరాటం సినిమా మాత్రం ఎలాంటి నష్టాలు లేకుండా బయటపడింది. 1985 ఏప్రిల్ నెలలో చిరంజీవి నటించిన చిరంజీవి సినిమాతో బాక్సాఫీసు వద్దకు వచ్చారు. అలాగే కృష్ణ అందరికంటే మొనగాడు చిత్రంతో అదే ఏడాది మరో సారి చిరంజీవికి పోటీగా వచ్చారు.

ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. ఆ తర్వాత అదే సంవత్సరం జులై నెలలో కృష్ణ నటించిన వజ్రాయుధం చిరంజీవి నటించిన జ్వాల సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో వజ్రాయుధం అద్భుతమైన విజయాన్ని అందుకోగా చిరంజీవి జ్వాలా సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది.1986 జనవరి ఒకటవ తేదీన చిరంజీవి కిరాతకుడు సినిమా విడుదల కాగా మూడవ తేదీ కృష్ణ నటించినకృష్ణ గారడి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేకపోయాయి.

1986 ఆగస్టు నెలలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చంటబ్బాయి అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలైన వారానికి కృష్ణ నటించిన కృష్ణ పరమాత్మ సినిమా విడుదలైంది. వారం వ్యవధిలో వచ్చిన ఈరెండు సినిమాలు ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. 1987 జనవరి నెలలో చిరంజీవి నటించిన దొంగమొగుడు సినిమా విడుదల కాగా ఈ సినిమాకు పోటీగా కృష్ణ నటించిన తండ్రి కొడుకుల ఛాలెంజ్ విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి దొంగ మొగుడు అద్భుతమైన విజయాన్ని అందుకోగా కృష్ణ సినిమా యావరేజ్ గా నడిచింది.

కృష్ణ దర్శకత్వంలో నటించిన శంఖారావం, మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం మధ్యాహ్నాలు ఏర్పడగా మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. చిరంజీవి జేబుదొంగ కృష్ణ దొంగగారు స్వాగతం మధ్య మరోసారి పోటీ ఏర్పడింది. ఈ చిత్రాలలో చిరంజీవి జేబుదొంగ ప్రేక్షకులను సందడి చేయలేకపోయినా కృష్ణ దొంగగారు స్వాగతం యావరేజ్ గా నడిచింది. అలాగే చిరంజీవి ఖైదీ నెంబర్ 786, కృష్ణ రౌడీ నెంబర్ వన్ చిత్రం మధ్య పోటీ ఏర్పడింది. ఈ రెండు సినిమాలలో చిరంజీవి ఖైదీ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

చిరంజీవి 100వ చిత్రం త్రినేత్రుడు కృష్ణ నటించిన అగ్ని కెరటాలు మధ్య మరోసారి పోటీ ఏర్పడింది. ఈ రెండు సినిమాలలో త్రినేత్రుడు వసూళ్ళ పరంగా పర్వాలేదనిపించింది. అదేవిధంగా చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడుకృష్ణ రాజకీయ చదరంగం మధ్య పోటీ ఏర్పడగా మెగాస్టార్ నటించిన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అదే విధంగా చిరంజీవి రాజా విక్రమార్క, కృష్ణ నాగాస్త్రం మధ్య పోటీ ఏర్పడింది. ఈ రెండు సినిమాలలో నాగాస్త్రం విజయం సాధించింది. అలాగే చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, కృష్ణ నటించిన పరమశివుడు విడుదలయ్యాడు ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు సందడి చేయలేక పోయాయి.

ఒకేసారి హిట్ కొట్టిన మెగాస్టార్, కృష్ణ…

రెండు సంవత్సరాల తర్వాత కృష్ణ చిరంజీవి మధ్య మరి పోటీ ఏర్పడింది. కృష్ణ నటించిన పచ్చని సంసారం చిరంజీవి నటించిన ముఠామేస్త్రి మధ్య పోటీ ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరిద్దరు 1994లో మరోసారి పోటీ పడ్డారు. మెగాస్టార్ ముగ్గురు మొనగాళ్లు కృష్ణ నెంబర్ వన్ చిత్రాల మధ్య పోటీ ఏర్పడింది. ఈ పోటీలో కృష్ణ విజయం సాధించారు.