Hero Krishna: దక్షిణాది సినీపరిశ్రమ అనగానే టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ లు గుర్తుకువస్తాయి. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు మద్రాస్ లోని విజయ- వాహిని, జెమినీ స్టూడియోస్ లోనే షూటింగ్ జరుపుకొని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందేవి. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం లాంటి పరిణామాలతో దక్షిణాది రాష్ట్రాలు సొంతగా సినీ పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిచిన్న రాష్ట్రమైన కేరళ అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించుకుంటుంది. అయినప్పటికి కొత్త కథలతో సినిమాలు నిర్మించి విజయపరంపర కొనసాగిస్తున్నారు.
ఆ క్రమంలో విజయవంతమైన చిత్రాల రీమేక్ హక్కులను టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కొన్ని సందర్భాల్లో బాలీవుడ్ కి అమ్ముతున్నారు. 1985 పీటర్ వేర్ దర్శకత్వంలో హారిసన్ ఫోర్డ్ హీరోగా విట్నెస్ (WITNES) చిత్రం విడుదలయింది. కొత్త కథలు కొరకు చూస్తున్నా మలయాళ కథారచయిత ‘ఫాజిల్’ విట్నెస్ చిత్రాన్ని చూసి ఇండియన్ నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసి మమ్ముట్టి, నదియా హీరో, హీరోయిన్లుగా “పూవిన్ పుతియా పూన్ తెన్నల్” చిత్రాన్ని రూపొందించారు.
మలయాళంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అలా ఈ విజయవంతమైన సినిమా కోసం ఇతర సినీ పరిశ్రమ నిర్మాతలు పోటీపడి రీమేక్ హుక్కులను కొనుక్కున్నారు. అనేకమంది తెలుగు నిర్మాతలు పోటీపడగా చివరికి రీమేక్ హక్కులు అల్లు అరవింద్ కు దక్కాయి. ఇది గమనించని విజయబాపినీడు ‘విట్నెస్’ అనే ఇంగ్లీష్ చిత్రాన్ని చూసి… ‘సాక్షి’ టైటిల్ తో ఓ కథను రాసుకున్నారు.
ఆచంట గోపీనాథ్ నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి హీరో హీరోయిన్ అని భావించాడు. ఇందులో బాలనటుడిగా మహేష్ బాబుని అనుకున్నారు. ఇక సినిమా షూటింగ్ ప్రారంభించాలి అన్న నేపథ్యంలో ఇదే కథతో చిరంజీవి సినిమా చేస్తున్నారని తెలియడంతో అలాంటి కథతోనే మరో సినిమా చేయడం మంచిది కాదని దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించడం విరమించుకున్నారు. అలా కృష్ణతో చేయాల్సిన పసివాడి ప్రాణం కాస్తా ఆగిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…