Mahesh Babu – Tharun: సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఇలా బాల నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సమయంలో కృష్ణ మహేష్ బాబు తన కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ చిత్రం కావాలని రచయితలకు చెప్పారు.
వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలంటే చాలా అద్భుతమైన కథ ఉండాలని భావించిన రచయితలు వీరి కోసం వంశీ సినిమాని తీసుకువచ్చారు. బి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో 1999 జులై 12వ తేదీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఉంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించారు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నమ్రత నటించారు. ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా 2000 వ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలైన వారానికి తరుణ్ సినిమా విడుదలైంది.
తరుణ్ హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రం నువ్వే కావాలి. ఈ సినిమా విడుదల కావడంతో యువతను బాగా ఆకట్టుకుంది. ఇలా ఈ సినిమా మహేష్ బాబు వంశీ సినిమా కలెక్షన్ల పై భారీ దెబ్బ కొట్టిందని చెప్పాలి. నువ్వే కావాలి విడుదలైన తర్వాత మహేష్ బాబు వంశీ సినిమా కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోయాయి. అప్పట్లో నువ్వేకావాలి సినిమా ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…