Lalitha jewellery kiran kumar : లలితా జ్యూయలర్స్ అసలు ఓనర్ నేను కాదు… కేజీఫ్ ని మించిన సామ్రాజ్యం : కిరణ్ కుమార్

Lalitha jewellery kiran kumar : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. రోజు టీవీ లో చూసే యాడ్ లో ఎంతో నిజం ఉంది అది మనకు తెలుసు కానీ కిరణ్ కుమార్ చెప్పాక ఆలోచించడం మొదలయింది. సాధారణంగా నగల యాడ్ అనగానే ఒక హీరోయిన్ లేక, మోడల్ నగలను అలకరించుకుని వచ్చే యాడ్స్ ఇంచుమించు అన్ని బ్రాండ్ల నగల ప్రకటనలు అలానే ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా ఒక కస్టమర్ ఎలా ఆలోచిస్తాడో అవి మా షో రూమ్ లో ప్రయత్నించండి అంటూ అందరిని తన వైపు చూసేలా అనుకున్నారు లలితా జువలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు. నగలను మా షో రూమ్ లో కొనండి అని అందరిలా ఆయన చెప్పలేదు. కేవలం మా షో రూమ్ లో నగల ధరలను, నగలను చూసి ఫోటో తీసుకుని ఇతర షో రూమ్ నగలతో పోల్చి ఆ తరువాత ఎక్కడ తక్కువ ధరలు లభ్యమావుతాయో అక్కడ కొనుక్కోండి అంటూ చెప్పాడు. ఈ మాటే చాలామంది వియోగదారులను ఆకర్శించింది.

డబ్బు మనిషి విలువను నిర్ణయిస్తుంది…

కిరణ్ కుమార్ తన వ్యాపారాన్ని నిజాయితీగా చేయాలనుకున్నారు అందుకే ప్రస్తుతం ఆయన వ్యాపారం సౌత్ ఇండియా మొత్తం విస్తరించి కొన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా మారింది. ఎంతో పేదరికం అనుభవించి 14 ఏళ్లకే వ్యాపారం మొదలు పెట్టి 19 ఏళ్ల సమయానికి వ్యాపారం లో వృద్ధిలోకి వచ్చారు. ఇక కిరణ్ గారు ఆయన తల్లి బంగారం గాజులను కరిగించి వ్యాపారం మొదలుపెట్టి ఇప్పుడు ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఒక కేజీఫ్ లాంటి కథే ఉన్నా కిరణ్ గారి తండ్రి కాలికి చెప్పులు కూడా లేని పేదరికంలో ఉండగా, ఇపుడు ఇన్ని కోట్లు సంపాదించినా తన తల్లి తండ్రి ఇపుడు ఆ విజయాన్ని చూడలేదని ఆ అసంతృప్తి ఉందంటూ చెప్పారు కిరణ్. అందుకే జీవితంలో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి వాళ్ళ ఆశీర్వాదమే మనకు మంచి విజయాలను అందిస్తుంది. ఇక నా రోజు ప్రారంభం నా పాత రోజులను గుర్తు చేసుకునే మొదలవుతుంది, ఆకలి బాధలు, డబ్బు లేని రోజులు మర్చిపోతే ఇపుడు సాధించిన విజయాన్ని నిలుపుకోలేము. ఒకప్పుడు మనిషికి విలువ ఇచ్చేవారు, ఇప్పుడు డబ్బు ఉన్నవాడికే విలువ ఇస్తున్నారు.

ఎవరు ఏమనుకున్నా ఇది నిజం ఎంత డబ్బు ఉంది అన్నదాన్ని బట్టి విలువ, గౌరవం ఉంటాయి అంటూ కిరణ్ అభిప్రాయపడ్డారు. ఇక మిగతా వారికంటే నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉన్నాను కాబట్టి నా సామ్రాజ్యం విస్తరిస్తోంది. నిజానికి మాయమాటలు చెప్పి ఒక నగ పది వేలు ఎక్కువకు అమ్మొచ్చు కానీ, నేను వెయ్యి కి అమ్మినా కానీ నేను అదే ధరతో ఒక వెయ్యి అమ్ముతాను, వాళ్ళు అన్ని అమ్మలేరు అదే అక్కడ జరిగేది. అది కాక ఈరోజు మోసం చేసి అమ్మితే రేపు మళ్ళీ నా దగ్గర కొనడానికి రారు కదా అంటూ వ్యాపార సూత్రం చెప్పారు. 1999 లో మొదలైన కిరణ్ గారి వ్యాపారం చెన్నై లోని లలితా జువలరీ షాప్ కొనడంతో మొదలయింది. ఆ షాప్ పేరు ఆయన పెట్టింది కాదు వేరే వాళ్ళ షాప్ ను కొనుక్కొని బంగారం వ్యాపారం మొదలపెట్టారు కిరణ్. ఇక కిరణ్ గారి సొంతూరు నెల్లూరు. రాజస్థాన్ కి చెందిన వారైనా నెల్లూరు కి వచ్చి తన ముందు తరాల వాళ్ళు స్థిరపడ్డారు, ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు.