Movie News

Actor Nikhil: కార్తికేయ 2విడుదల విషయంలో దిల్ రాజు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నిఖిల్?

Actor Nikhil: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ2. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ తిరిగి ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైనప్పటినుంచి మంచి టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్లను రాబడుతుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడుతున్నప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా థియేటర్లు దొరక్కుండా చేశారంటూ నిఖిల్ బాధపడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని నిఖిల్ సినిమా విడుదల విషయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు హస్తం కూడా ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ…ఈ సినిమా విడుదల వాయిదా విషయంలో దిల్ రాజు ప్రమేయం ఏమాత్రం లేదని చెప్పాలంటే ఆయన మద్దతు వల్లే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిందని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి అంటూ నిఖిల్ దిల్ రాజు గురించి వస్తున్న వార్తలపై ఖండించారు. ఇకపోతే ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న కొత్త నిర్ణయాలు ప్రకారం ఒకే రోజే ఇద్దరి హీరోల సినిమాలు విడుదలయితే కలెక్షన్ల పరంగా పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయని చెప్పడం వల్లే తాను మరోసారి తన సినిమాని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని నిఖిల్ తెలిపారు.

Actor Nikhil: మంచి సినిమా తరచూ వాయిదా పడటం బాధ కలిగించింది…

ఇకపోతే ఒక మంచి సినిమా ఇలా తరచూ వాయిదా పడటంతోనే తాను బాధపడ్డానని, తాను ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నా సినిమా విడుదలకు ఫలానా వాళ్లు కారణమంటూ ఎక్కడ ప్రస్తావించలేదని ఈయన వెల్లడించారు. మొత్తానికి అనుపమ నటించిన ఈ సినిమా కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి కలెక్షన్లను రాబట్టిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం నిఖిల్ దిల్ రాజు గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago