Movie News

Anchor Anasuya: నా ఆత్మగౌరవం ఎప్పటికీ చంపుకోను…అవకాశాలు లేకపోతే అంట్లు తోముకుంటా.. అనసూయ కామెంట్స్ వైరల్!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమయ్యారు.ఇలా తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన ఈ కార్యక్రమం నుంచి ఈమె వెళ్లిపోవడం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే తాజాగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై నోరు విప్పారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్తుంటే తన సొంత ఇంటిని వదిలి వెళుతున్నాను అనే బాధ తనలో కలిగిందని, టీవీ కార్యక్రమాలకు తాను దూరం అవుతానా అనే భయం కూడా తనలో కలిగిందని ఈమె తెలిపారు. ఇకపోతే తాను ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయిగా ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్న మొదట్లో చాలామంది నువ్వు మేకప్ వేసుకోగలవా? కెమెరాను ఫేస్ చేయగలవా? అంటూ ప్రశ్నించినట్లు ఈమె తెలిపారు.

మనం ఇదే రంగం అని కాదు ఏ రంగంలోకి వెళ్లిన చెడు మంచి అనేది ఉంటాయి. అయితే మనం ఎంచుకొనే గమ్యం పట్టి మన ప్రయాణం ఉంటుందని అనసూయ వెల్లడించారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం తనకు ఎంతో మంచి పేరు తెచ్చిందని అయినా కానీ ఈ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా పడ్డానని ఈమె తెలిపారు. ఇలా నాకు ఈ కార్యక్రమంలో ఎదురైన ఇబ్బందుల వల్లే తాను బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని ఈమె తెలిపారు.

Anchor Anasuya: ఎప్పటికీ ఆ తప్పు చేయను…

తనకు తన ఆత్మ గౌరవం కన్నా ఏది ముఖ్యం కాదని మన ఆత్మగౌరవాన్ని చంపుకొని పనిచేయాల్సిన అవసరం లేదంటూ ఈమె తెలిపారు. ఇక ఈ ఫీల్డ్ లో తన ఆత్మ గౌరవాన్ని చంపుకోవాల్సిన పరిస్థితి వస్తే తాను పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తాను ఎంబీఏ చదివానని అలా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతానని తెలిపారు.ఇక అక్కడ కూడా ఇబ్బందులు ఎదురైతే ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటాను కానీ తన ఆత్మ గౌరవాన్ని ఎప్పటికీ చంపుకోనని అనసూయ ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago