Movie News

Actress Priyamani: విడాకులకు సిద్ధమైన నటి ప్రియమణి.. విడాకులకు కారణం అదేనా?

Actress Priyamani: సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ అయింది. ఈ క్రమంలోని ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమించుకుని ప్రేమలో కొన్ని సంవత్సరాల పాటు విహరించి ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత వీరి వైవాహిక జీవితం కొన్ని సంవత్సరాలు కూడా గడవకు ముందే తెగ తెంపులు చేసుకుంటున్నారు.

ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా బ్రతుకుతున్నారు. మరికొందరు రెండో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక జంట కూడా విడాకులకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి ప్రియమణి తన భర్త ముస్తఫా రాజ్ కి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.

ముస్తఫా రాజ్ ఇదివరకే పెళ్లి చేసుకొని తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే ప్రియమణితో ప్రేమలో పడిన ఈయన తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిపోయింది. ఇకపోతే తన భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే రెండవ పెళ్లి చేసుకున్నారని,ప్రియమణి పెళ్లి చెల్లదు అంటూ మధ్యలో పెద్ద వివాదం సృష్టించారు. అయినప్పటికీ ప్రియమణి వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.

Actress Priyamani: పిల్లల విషయంలో మనస్పర్ధలే కారణమా…

ఇకపోతే తాజాగా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ప్రియమణి ముస్తఫా రాజ్ వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోతున్న పిల్లల గురించి ప్రియమణి ఏమాత్రం ఆలోచించలేదని తను కెరియర్ లో సెటిల్ అయిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చింది.ఇక పిల్లల విషయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి గొడవలు జరిగాయని అందుకే వీరిద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా తన విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ ప్రియమణి మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించకపోవడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago