Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.
ఇకపోతే ఈ రౌడీ హీరో సినిమాలు వస్తున్నాయని తెలిస్తే అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పాలి. ఇలా విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చేంత అభిమానులు ఉన్నారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం విజయ్ దేవరకొండకు అభిమానులుగా మారిపోయారు. ఆయన పక్కన ఛాన్స్ వస్తే చాలు నటించడానికి సిద్ధంగా ఎంతోమంది ముద్దుగుమ్మలు ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ వంటి వాళ్ళు కూడా తనతో డేట్ కి వెళ్లాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం వస్తే ముఖానే నటించనని ఒక హీరోయిన్ చెప్పారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికొస్తే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన డియర్ కామ్రేడ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో తాను నటించనని చెప్పారట.
ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉండడంతో అలాంటి సన్నివేశాలలో తాను నటించలేనని అందుకే ఈ సినిమాని వదులుకున్నట్లు సమాచారం.ఈ సినిమానే కాదు భవిష్యత్తులో తనతో కలిసి ఎలాంటి సినిమాలలో కూడా నటించమని సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల ఎంపిక తన సినిమాల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుందని అందుకే తన సినిమాలలో నటించడానికి తాను సిద్ధంగా లేనంటూ సాయి పల్లవి విజయ్ దేవరకొండ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…