Director Shankar Daughter: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ హీరో హీరోయిన్ల పిల్లలు అలాగే దర్శక నిర్మాతలు టెక్నీషియన్ పిల్లలు ఇండస్ట్రీలోకి వారసులుగా రావడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క భాషలో కూడా మనకు నెపోటిజం కనబడుతూనే ఉంది.ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ శంకర్ గురించి పరిచయం అవసరం లేదు. ఇక ఈయన కుమార్తె అదితి శంకర్ సైతం కార్తి హీరోగా నటించిన విరుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అతిథి శంకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నిజం చెప్పాలంటే తాను ఇండస్ట్రీలోకి రావడం తన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదని అదితి శంకర్ పేర్కొన్నారు. ఇకపోతే తనకు మాత్రం ఇండస్ట్రీలో కొనసాగడం ఇష్టమని తెలియడంతో తన ఇష్టాన్ని కాదనలేక నాన్న ఇండస్ట్రీలోకి రావడానికి ఒప్పుకున్నారని తెలిపారు.
ఇకపోతే ఇండస్ట్రీలో తను ఏ హీరోతో అయినా కానీ నటించు కానీ ఒక్క హీరోతో మాత్రం నటించవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు ఈమె తెలిపారు. అయితే శంకర్ ఈ విధంగా తన కూతురుకు వార్నింగ్ ఇచ్చారని తెలియడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే శంకర్ ఎవరితో తన కూతురు నటించడం ఇష్టం లేదనే విషయానికి వస్తే…
కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నటుడు శింబు సరసన తన కూతురు నటించడానికి శంకర్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇలా ఆయన సరసన నటించడానికి ఇష్టపడకపోవడానికి గల కారణం ఆయనకున్న ప్రేమ వ్యవహారాలే కారణమని తెలుస్తుంది.ఇక శంకర్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ ఒక కూతురికి తండ్రిగా తన కూతురి విషయంలో వ్యవహరించారని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి శంకర్ కుమార్తె ఆదితి శంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…