Featured

Annapurnamma : మా అమ్మ నన్ను క్షమించనని చెప్పింది… అప్పుడు కొట్టిన దెబ్బలకి వాతలు చాలా కాలం ఉన్నాయి : అన్నపూర్ణమ్మ

Annapurnamma : తెలుగు ఇండస్ట్రీ లో తల్లి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అన్నపూర్ణమ్మ. 700 కి పైగా సినిమాల్లో నటించిన అన్నపూర్ణమ్మ అసలు పేరు ఉమా మహేశ్వరి. నాటకాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ఆమె దాసరి నారాయణరావు గారి సినిమా ‘స్వర్గం నరకం’ లో మోహన్ బాబు సరసన మొదరి సారి హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత కూడా హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమైంది. ఇక సినిమాల్లో తాను ఎదుర్కొన్న సమస్యలను, తన అనుభవాలను పలు ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు అన్నపూర్ణమ్మ.

అమ్మ క్షమించనని చెప్పింది…

హీరోయిన్ గా మొదటి సినిమా చేసినా అంతకు ముందే ఒక సినిమా షూటింగ్ అయిపోయి డబ్బింగ్ సమయంలో ‘స్వర్గం నరకం’ సినిమా ఆడిషన్ కి వెళ్లి సెలెక్ట్ అయ్యానని అన్నపూర్ణమ్మ చెప్పారు. ఇక హీరోయిన్ గా షూటింగ్ కి వెళ్ళినపుడు డైరెక్టర్ ఏమీ అనరు కానీ పక్కన ఉన్న వాళ్ళు చాలా మాట్లాడుతారు. ఆ మాటలు నాకు నచ్చలేదు హీరోయిన్ అయితే ఇవన్నీ వినాల్సి వస్తుంది నాకు అవసరమా అని నిర్ణయించుకున్నారు. ఇక వాంప్ పాత్రలు చేయడం కూడా నాకు ఇష్టం లేదు. సినిమా నా జీవితంలో ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలీదు కానీ నా జీవితంలో ఆ పాత్రల ప్రభావం ఉంటుంది. నన్ను ఆ ఉదేశ్యం తో కొంతమంది చూసినా నాకు నచ్చదు అందుకే చేయకూడదు అని నిర్ణయించుకున్నాని.

ఇక షూటింగులో ఒకరు మనకు చెప్పిన మాటను ఇతరులకు చెపుతుంటారు నేను అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను. చిన్నతనంలోనే ఒక సారి నాకు తెలియకుండానే తప్పు చేశాను. ట్యూషన్ మాస్టర్, నాతో పాటు చదివే అమ్మాయిని ఇష్టపడి వాళ్లిదరు నా ద్వారా ఉత్తరాలు బహుమతులు మార్చుకునే వాళ్ళు ఒకరోజు నేను దొరికిపోయా అప్పుడు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ అమ్మాయి తరుపున వాళ్ళు మా అమ్మ కూడా అడ్డు చెప్పలేదు. కొట్టమని చెప్పింది నన్ను క్షమించనని చెప్పింది. ఇక అప్పుడు పడిన వాతలు చాలా కాలం ఉండిపోయాయి అలా ఇంకెప్పుడు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను అంటూ తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago