Featured

Puri Jagannath : సినిమా కోసం రెండు కోట్లు పంపిస్తే.. అప్పులు తీర్చేయండి అంటూ వెనక్కి పంపేసాడు.. విజయ్ దేవరకొండ రియల్ హీరో : పూరీ జగన్నాథ్

Puri Jagannath : పూరీ జగన్నాథ్ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి కరణ్ జోహార్ సహాయంతో నిర్మాత గా తీసిన చిత్రం లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడిగా అనన్య పాండే నటించింది. ఇక రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా ఆగష్టు 25 న విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరును పెంచింది. ఇక సినిమా ఈవెంట్ ను వరంగల్ సత్యసాయి కన్వెన్షన్ హల్ లో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి పూరీ, ఛార్మి, విజయ్ దేవరకొండ, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. సినిమా గురించి మాట్లాడుతూ పూరీ ఆసక్తికర వాఖ్యలు చేసారు.

కరణ్ కింగ్ ఆఫ్ బాలీవుడ్…

లైగర్ సినిమా నిర్మాణంలో సహకరించిన కరణ్ జోహార్ కు కృతజ్ఞతలు తెలిపిన పూరీ జగన్నాథ్, నేను కలిసిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి కరణ్ జోహార్. అయన చాలా సింపుల్ గా ఉంటూ తన జీవితాన్ని రాజులాగా అస్వాదిస్తున్నాడు అంటూ పూరీ కామెంట్స్ చేసారు. ఇక లైగర్ సినిమా నిర్మాణం గురించి మాట్లాడుతున్న సమయంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గోల చేయడంతో విజయ్ గురించి పూరీ మాట్లాడాడు.

నా భార్య ఆ సినిమా చూడమని చెప్పి మారమంది…

విజయ్ దేవరకొండా గురించి మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాడారు. పూరీ మాట్లాడుతూ నా భార్య నేను ఫెయిల్యూర్ లో ఉన్న సమయంలో కొత్త డైరెక్టర్లను చూసి నేర్చుకో ఒకసారి కొత్త సినిమాలు చూడు అని చెప్పింది. ఏ సినిమా చూడాలి అనుకున్నపుడు సందీప్ వంగ, అర్జున్ రెడ్డి సినిమా చూపించింది. ఆ సినిమా చూస్తూ మధ్యలో ఆపేసాను. సినిమా బాగుంది డైరెక్షన్ బాగుంది కానీ నేను విజయ్ దగ్గరే ఆగిపోయాను. అప్పుడు అనుకున్నాను విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనీ, తన లాంటి హీరోని చూడలేదు. సినిమా చేద్దామని కోటి రూపాయలు పంపితే సినిమా అవసరాలకు ఉంటాయని తిప్పి పంపాడు. ఇక సినిమా నిర్మాణ సమయంలో తనకు రెండు కోట్లు ఇస్తే అప్పులు ఉన్నాయి కదా అవి ముందు క్లియర్ చేయండి అని తిరిగి వెనక్కి పంపాడు. ఈ కాలం లో ఇలాంటి హీరోని నేను చూడలేదు అంటూ విజయ్ దేవరకొండను ప్రశంసిచారు పూరీ జగన్నాథ్. ఇక విజయ్ కూడా లైగర్ సినిమాకు పూరీ ఛార్మి తల్లి తండ్రులు అంటూ మాట్లాడాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago