Chiranjeevi: చిరు అల్లూరి విగ్రహావిష్కరణ ఆహ్వానం వెనుక ఇంత కథ నడిచిందా.. చిరు వద్దంటేనే విజయేంద్ర ప్రసాద్ కు అవకాశం వచ్చిందా?

డైలాగులు నేర్చుకోవాలా? నటించాలా… టాలీవుడ్ డైరెక్టర్ల తీరుపై మండిపడిన మెగాస్టార్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇలా ఈయన వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసింది.

Chiranjeevi: చిరు అల్లూరి విగ్రహావిష్కరణ ఆహ్వానం వెనుక ఇంత కథ నడిచిందా.. చిరు వద్దంటేనే విజయేంద్ర ప్రసాద్ కు అవకాశం వచ్చిందా?

ఈ క్రమంలోనే ఈ సినిమా వచ్చే నెల 11వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ మీడియా సమావేశంలో భాగంగా చిరంజీవి పలువురు టాలీవుడ్ డైరెక్టర్ లపై తీవ్రస్థాయిలో అవగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ… కొంతమంది డైరెక్టర్లు అప్పటికప్పుడు లొకేషన్ లోనే నటీనటులకు డైలాగులు రాసిస్తారు.ఈ విధంగా డైలాగులు అప్పటికప్పుడు ఇవ్వటం వల్ల నటీనటులు డైలాగులు నేర్చుకోవాలా? లేకపోతే నటనపై దృష్టి పెట్టాలా? అప్పటికప్పుడు డైలాగులు రాసిస్తే వారు ఎలా నేర్చుకుంటారు.

డైరెక్టర్లు తమ ధోరణి మార్చుకోవాలి….

డైరెక్టర్లు ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయంలో డైరెక్టర్లు తమ ధోరణిను మార్చుకోవాలని ఈ సందర్భంగా చిరంజీవి టాలీవుడ్ డైరెక్టర్లపై మండిపడ్డారు. ఈ విధంగా చిరంజీవి డైరెక్టర్ల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.