Venu Thottempudi : ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయిన వేణు అనతి కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, కళ్యాణ రాముడు, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. చివరగా దమ్ము సినిమాలో కనిపించిన వేణు ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. తన సినిమాల్లో కామెడీ ఎమోషన్ తో మహిళా అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్న వేణు అకస్మాత్తుగా సినిమాకు దూరం అయ్యాడు.
భార్య పిల్లల గురించి…
వేణు చెన్నై లో నివసిస్తున్నారు. సినిమాలనుండి వెళ్ళిపోయి వ్యాపార పనుల్లో బిజీ అవ్వడం వల్ల మళ్ళీ సినిమాల వైపు చూడలేదట వేణు తోట్టెంపూడి. అంతే కానీ ఇతర కారణాలేమి లేవని చెప్పారు. ఇక వేణు కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల తనది ప్రేమ అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం అని చెప్పారు. ఇక పిల్లల విషయానికి వస్తే వేణు కి ఒక పాప ఒక బాబు. పాప 12 తరగతి చదువుతుండగా, బాబు 10 తరగతి చదువుతున్నాడు. సినిమాల్లోకి పిల్లలను తీసుకొచ్చే ఉద్దేశం గురించి మాట్లాడుతూ అది వాళ్ళ ఇష్టం ఇంకా చిన్నవాళ్లు కదా చెప్పలేము అంటూ అన్నారు. తొమ్మిది సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండి మళ్ళీ రీ ఎంట్రీ కి కారణం అడుగగా కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఎక్కువ సమయం గడపడం అందునా వెబ్ సిరీస్ లు, టీవీ లో సినిమాలు చూడటం వల్ల మళ్ళీ సినిమాల వైపు రావాలి, నటించాలి అని అనిపించింది.
కొంత మంది నటన చూసినపుడు బాగా ఈర్ష్య కలిగింది. నాకు ఇలాంటి పాత్రలు వచ్చి ఉంటే బాగుండు కదా అనిపించింది. ఇక అప్పటికే రామరావు ఆన్ డ్యూటీ సినిమా నుండి శరత్ మండవ సీఐ మురళి పాత్రకు అడిగినపుడు మొదట ఆలోచించాను ఆ తరువాత ఒప్పుకున్నాను. కథ పాత్ర విన్నాక ఒప్పుకున్నాను. ఇల్లు పిల్లల గురించి నా భార్య భాద్యత తీసుకోవడం వల్ల నేను వ్యాపారం చేయగలిగాను. చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉండటం సాధ్యపడింది. నా లైఫ్ లో సక్సెస్ కి క్రెడిట్ నా వైఫ్ కే ఇస్తాను అంటూ వేణు చెప్పారు. ఇక రామరావు ఆన్ డ్యూటీ లో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…