Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు.మెగా వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నిహారిక ప్రస్తుతం వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నప్పటికీ ఈమె మాత్రం సినిమాపై ఇష్టంతో ఇప్పటికి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కెరియర్ మొదట్లో యాంకర్ గా హీరోయిన్ గా చేసినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే వివాహం అనంతరం నిహారిక నిర్మాతగా మారిపోయారు. ఇలా వృత్తిపరమైన జీవితంతో ఎంతో బిజీగా గడుపుతున్న నిహారిక తన వ్యక్తిగత విషయాలను అలాగే సినిమా విషయాలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక పలుసార్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు.
గతంలో తన జిమ్ ట్రైనర్ తో కలిసి చేసిన వీడియో పెద్ద ఎత్తున వివాదానికి తెరతీసింది. ఈ క్రమంలోనే కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరమైన నిహారిక తిరిగి ఎంట్రీ ఇచ్చారు.అప్పటినుంచి ఈమె తన వ్యక్తిగత విషయాలను అలాగే సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన పర్సనల్ వీడియోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
నిహారిక తన గదిలో తన భర్త ఒడిలో పడుకొని ఏకంగా ముద్దుల వర్షం కురిపించింది. అయితే ఈ ముద్దులు తన భర్తకు కాదంట.. ఇలా భర్త ఒడిలో పడుకున్నప్పటికీ తన ముద్దులు మాత్రం తన అక్క సుస్మితకే అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోని తన అక్క సుస్మిత తీయడం విశేషం.ఇలా తన అక్క పై ముద్దుల వర్షం కురిపిస్తూ ఈ ముద్దులన్నీ నీకే అక్క అంటూ చెప్పుకొచ్చారు.ఇలా నిహారిక షేర్ చేసిన ఈ వీడియో చూస్తుంటే తనకు సుస్మితకు మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో అర్థం అవుతుంది. ఇక నిహారిక సైతం సుస్మిత బాటలోనే వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…