Bandla Ganesh: ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ వస్తుంటాయి... పూరి ఛార్మిలతో పాటు సెలబ్రెటీలను ఓ రేంజ్ లో ఆడుకున్న బండ్లన్న!
Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి పరిచయం అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో ఈయన ఎలాంటి సినిమాలను నిర్మించకపోయినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో ఉంటున్నారు.గత రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు బ్రదర్ టాలెంట్ కూడా ఉండాలి. ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లా టాలెంట్ కూడా ఉండాలి అంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.అయితే బండ్ల గణేష్ ఇక్కడ ఎవరిని పొగుడుతూ ఎవరిని విమర్శించారో తెలియడం లేదు.విజయ్ దేవరకొండకు కౌంటర్ ఇచ్చారా లేకపోతే ఈ హీరోలను పొగుడుతూ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వంటి హీరోలను అవమానించారా అనే విషయం తెలియడం లేదు.
ఇలా ఆ హీరోలందరిని పేర్లను ప్రస్తావించిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పేర్లను ప్రస్తావించకపోవడంతో వీరి అభిమానులు బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్నారు. వీరిద్దరూ టాలెంటెడ్ యాక్టర్స్ కాదా..వీరి పేర్లు ప్రస్తావించకపోవడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున బండ్లన్న పై ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ సైతం తన తాత అల్లు రామలింగయ్య,మెగాస్టార్ చిరంజీవి వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి తన టాలెంట్ తో పాన్ ఇండియా హీరో అయ్యారు. మరి బండ్ల గణేష్ కు ఈ హీరో గుర్తు రాలేదా అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
వాళ్ళిద్దరూ టాలెంటెడ్ యాక్టర్స్ కాదా…
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం బండ్ల గణేష్ ఓ ఆట ఆడుకుంటున్నారు.నిత్యం పవన్ కళ్యాణ్ పేరు నామస్మరణ చేసే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పేరు ఎలా మర్చిపోయారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి పరోక్షంగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ మధ్య వ్యవహారం చెడిందనీ అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ మరికొందరు భావిస్తున్నారు. మొత్తానికి బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…