Featured

Amma Rajashekhar : జేడి చక్రవర్తిని పెట్టి సినిమా తీస్తే కథ, టైటిల్ తో సహా అన్నీ మార్చేసాడు.. చివరికి మా అమ్మ హాస్పిటల్లో ఉంటే నా దగ్గర డబ్బులు లేకుండా చేసాడు : అమ్మ రాజశేఖర్

Amma Rajashekhar : డాన్స్ మాస్టర్ గా సినిమాల్లో సక్సెస్ అయి సినిమా దర్శకులు గా మారిన వారిలో అమ్మ రాజశేఖర్ ఒకరు. తెలుగులో గోపీచంద్ తో తీసిన ‘రణం’ సినిమా ద్వారా డైరెక్టర్ గా మంచి హిట్ అందుకున్న అమ్మ రాజశేఖర్ ఆ తరువాత వరుస ప్లాప్ లను చవిచూసి డైరెక్టర్ గా కెరీర్ డౌన్ కి వెళ్ళిపోయింది. ఆర్థికంగా కూడా నష్టాలను చూసిన అమ్మ రాజశేఖర్ తనను సినిమాల్లో చాలా మంది మోసం చేసారంటూ చెప్పాడు.

జేడీ చక్రవర్తి అలా అంతా మార్చేశాడు…

తన గురువుగా భావించే జే డి చక్రవర్తి మోసం చేసాడని ఆరోపించాడు. ప్రొడ్యూసర్ గా సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ నష్టపోతున్నపుడు మళ్ళీ డైరెక్షన్ వైపు వెళ్ళాను. ఒక కథ అనుకున్నాక జేడీ చక్రవర్తికి కథ వినిపించగా ఓకే అన్నాడు. ఇక ప్రొడ్యూసర్ కూడా కుదిరాక షూటింగ్ అంతా పూర్తయింది. ఇక సినిమాకు ఉగ్రమ్ అనే పేరు అనుకున్నాం. అయితే ప్రొడ్యూసర్ పక్కన ఉండే కాశి అనే వ్యక్తి జేడీ చక్రవర్తి అభిమాని అంటూ బాగా సోప్ వేసే వాడు. నేను చూసి పెద్దగా పట్టించుకోలేదు. పచ్చబొట్టు వేయించుకున్నా అంటూ చూపించాడు కూడా.

ఇక సినిమా అంతా పూర్తయ్యాక ప్రొడ్యూసర్ నక్షత్రకి కూడా అలానే మాటలు చెప్పి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక మళ్ళీ సినిమాలో ఎడిటింగ్ చేసి మళ్ళీ రీ రికార్డింగ్ చేసారు. హిందీ లో అరవై లక్షలకు సినిమా అమ్మేసిన తరువాత, ఇక టైటిల్ తో సహా అంతా మార్చారు, నాకు తెలియకుండా ఇదంతా చేసారు. మూడు నెలల్లో పూర్తి అయిన సినిమాను మూడు సంవత్సరాలు చేసి సినిమాను నాశనం చేసారు. ఇక సినిమాకు నా షేర్ నాకు ఇవ్వలేదు. కనీసం ఒక పది లక్షలు ఇవ్వమన్నా ఇవ్వలేదు. మా అమ్మ కి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో ఉన్నపుడు డబ్బు అడిగినా ఇవ్వలేదు. నా గురువు కాబట్టి జేడీ చక్రవర్తిని వదిలేసాను ఈ విషయంలో లేకపోతే గొడవ జరిగేది.

Bhargavi

Recent Posts

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

6 hours ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

6 hours ago

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే వేల రూపాయల తగ్గుదల.. తాజా ధరలు ఇవే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…

6 hours ago

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

22 hours ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

22 hours ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

22 hours ago