అలనాటి తార భానుమతి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

అలనాటి తార భానుమతీ రామకృష్ణ. ఈమె నటిగానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా ఎన్నో బాధ్యతలు చేపట్టింది. ఇక ఈమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య. తల్లి సరస్వతమ్మ. ఈమె సుప్రసిద్ధ కవి. తన తండ్రి కూడా సంగీత కళాకారుడిగా చేశాడు. భానుమతి తన తండ్రి దగ్గరనే సంగీతం నేర్చుకుంది. అంతేకాకుండా బాలనటిగానే చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఇదిలా ఉంటే ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వరవిక్రయం సినిమాతో తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించింది. ఇక ఈమె చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ పి ఎస్ రామకృష్ణ పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఒక కూతురు పుట్టగా భరణి అని పేరు పెట్టారు. భరణి పేరు మీదనే ఓ స్టూడియోను కూడా స్థాపించారు.

ఈ స్టూడియోలో కూడా వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇక భానుమతి కి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం కూడా అందింది. ఇక ఈమె నిర్మాణ సంస్థలో మొదటి సినిమా రత్నమాల 1948 లో విడుదలైంది. ఇక ఈ సినిమాకు తన తల్లినే కథలు అందించారు. అంతేకాకుండా తన భర్త రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక 1952లో చండీరాణి సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయింది. చిత్ర పరిశ్రమలో తొలిసారిగా మహిళా దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషలలో కూడా విడుదల చేయగా మంచి గుర్తింపు తెచ్చింది. ఎన్టీఆర్, భానుమతి కలిసి నటించిన వివాహ బంధం సినిమాలో కూడా మంచి గుర్తింపు అందుకోగా.. ఈ సినిమా షూటింగ్ సమయంలో కన్నాంబ కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె నటించిన పాత్రలో సూర్యకాంతంతో చేయించారు.