టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఈయన గురించి, ఈయన నటన గురించి అందరికి తెలిసిందే. ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కువగా సాంఘిక సినిమాలలో నటించిన ఈయన ఇప్పటివరకు పౌరాణిక సినిమాలలో ఫుల్ లెన్త్ లో నటించనేలేదు. కానీ ఓ సినిమాలో మాత్రం అర్జున పాత్రలో నటించాడట. ఈ విషయం చాలా వరకు ఎవరికి తెలియక పోగా అది కేవలం ఐదు నిమిషాల సన్నివేశంలో మాత్రమే నటించాడట చిరంజీవి.
బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టేట్ రౌడీ సినిమా. ఈ సినిమాను సుబ్బరామిరెడ్డి నిర్మించగా.. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి అర్జునుడి వేషం వేయగా.. నూతన ప్రసాద్ శ్రీకృష్ణుడి పాత్రను వేసాడు. రావు గోపాలరావు గయుడి పాత్రలో నటించగా ఈ సన్నివేశం కేవలం 5 నిమిషాల్లో మాత్రమే ఉంది. కానీ ఇందులో చిరంజీవి నటించిన పాత్రకు మాత్రం మంచి గుర్తింపు అందింది.
ఇక ఇప్పటివరకు మళ్లీ ఇటువంటి పాత్రల్లో నటించకపోగా.. చిరంజీవి అభిమానులు మాత్రం ఇటువంటి పౌరాణిక పాత్రలలో చిరంజీవిని చూడాలని అనుకుంటున్నారు. ఇక చిరంజీవి అభిమానుల కోరిక ఎప్పుడు తీరుస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు. ఆచార్య సినిమా తర్వాత ఈ సినిమా షూటింగ్ లో అడుగు పెట్టనున్నాడు చిరంజీవి. ఇక ఈ సినిమాతో పాటు బాబి దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేశాడు. అంతేకాకుండా రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. మొత్తానికి చిరంజీవి వరుస సినిమాలలో బిజీగా ఉండగా యంగ్ హీరోలతో పోటీగా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…