Liger Movie: IMDBలో అత్యంత చెత్త రేటింగ్ దక్కించుకున్న లైగర్… మరి ఇంత దారుణమా?

Liger Movie: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల నడుమ విజయ్ దేవరకొండ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా కనీసం విజయ్ దేవరకొండ అభిమానులను కూడా సందడి చేయలేక పోయింది.

ఈ విధంగా మొదటి షో తోనే డిజాస్టర్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు తాజాగా ఐఎండిబిలో దారుణమైన రేటింగ్ దక్కించుకుంది. గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త శరవనన్ నటించిన ది లెజెండ్ సినిమా కన్నా ఘోరంగా లైగర్ సినిమా రేటింగ్స్ సొంతం చేసుకుంది. ది లెజెండ్ సినిమాకు 4.7 రేటింగ్ రాగా లైగర్ సినిమాకు మాత్రం మరి దారుణంగా 1.7 రేటింగ్ రావడం గమనార్హం.

విజయ్ దేవరకొండ ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇలాంటి పేరు ప్రఖ్యాతలు క్రేజ్ ఉన్నటువంటి హీరో సినిమాకి మరి దారుణంగా 1.7 రేటింగ్ ఇవ్వడం ఏంటి అంటూ నేటిజన్ లు పెద్ద ఎత్తున ఈ సినిమా రేటింగ్ విషయంపై మండిపడుతున్నారు. ఇకపోతే ఇదివరకే బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైనటువంటి ఆమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ సినిమాల కన్నా కూడా దారుణమైన రేటింగ్ రావడం గమనార్హం.

Liger Movie: దారుణమైన రేటింగ్ సొంతం చేసుకున్న లైగర్..

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన సినిమాకి గాను ఐఎండిబిలో 10కి గాను 5 రేటింగ్స్ సొంతం చేసుకోగా అక్షయ్ కుమార్ రక్షాబంధన్ 4.6 రేటింగ్ సొంతం చేసుకుంది.ఇక ఈ రెండు సినిమాలు కన్నా లైగర్ సినిమా కూడా దారుణమైన రేటింగ్ సొంతం చేసుకోవడంతోనే ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుందో అర్థమవుతుంది.ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమా మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పాలి.