Movie News

Meghana Raj: భర్త పేరును టాటూగా వేయించుకొని ఆ వార్తలకు చెక్ పెట్టిన నటి మేఘన రాజ్!

Meghana Raj: కన్నడ సినీ నటుడు చిరంజీవి సర్జా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనంతరం ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలో ఈయన నటి మేఘన రాజ్ అనే అమ్మాయిని 2018న వివాహం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఊహించని విషాదం చోటుచేసుకుంది.

2020 జూన్ 7వ తేదీ చిరంజీవి సర్జ గుండెపోటుతో మరణించడం అందరిని ఒక్కసారిగా శోక సంద్రంలోకి నెట్టి వేసింది. ఇదిలా ఉండగా చిరంజీవి సర్జ మృతి చెందే సమయానికి మేఘన గర్భవతి కావడం విశేషం.అయితే తన భర్త మరణించిన అనంతరం తన భర్త ప్రతిరూపాన్ని కడుపులో మోస్తూ తానే ప్రాణంగా బ్రతికిన మేఘన ఇప్పుడిప్పుడే తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడుతూ కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ విధంగా ఈమె పలు సినిమాలలో నటిస్తూనే కొన్ని బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.ఈ విధంగా మేఘన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలో ఈమె రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున తన పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను ఎలాంటి పెళ్లి చేసుకోలేదని ఈ సందర్భంగా ఈమె క్లారిటీ ఇచ్చారు.

Meghana Raj: మణికట్టుపై టాటూతో క్లారిటీ ఇచ్చిన నటి..

మేఘన రాజ్ సోషల్ మీడియా వేదికగా తన భర్త పేరుతో పాటు తన కుమారుడి పేరు వచ్చేలా టాటూ వేయించుకున్నారు.ఇలా మణికట్టుపై తన కొడుకు భర్త పేరును టాటూగా వేయించుకున్న ఈమె ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫరెవర్ అంటూ లవ్ సింబల్ తో ఈ ఫోటోని షేర్ చేశారు. ఇలా ఎప్పటికీ వారు తన గుండెల్లో నిలిచిపోతారంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ పోస్ట్ తో తాను రెండో పెళ్లి చేసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago