Mansoor Ali khan: మద్రాస్ హైకోర్టులో మన్సూర్ కి ఎదురు దెబ్బ.. లక్ష జరిమానా కట్టాలంటూ తీర్పు!

Mansoor Ali khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ సినిమా విడుదలైన తరువాత పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచారు. ఈ సినిమాలో ఈయన విలన్ పాత్రలలో నటించారు. ఈ సినిమాలో ఈయన త్రిష పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వివాదాలలో చిక్కుకున్నారు.

పలు సినిమాలలో రేప్ సన్నివేశాలలో నటించినటువంటి మన్సూర్ ఈ సినిమాలో కూడా త్రిషతో అలాంటి సన్నివేశాలు ఉంటాయి అనుకున్నాను కానీ త్రిషతో అలాంటి సన్నివేశాలు లేవు అంటూ ఈయన ఆమె పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వివాదానికి కారణమయ్యాయి. సెలబ్రిటీలు ఆయనని తప్పుపడుతూ త్రిషకు మద్దతుగా నిలబడ్డారు.

ఇక త్రిషకు మద్దతుగా నిలిచినటువంటి వారిలో నటి కుష్బూ మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా ఉన్నారు. అయితే వీరందరూ కూడా నిజా నిజాలు తెలియకుండా తన పరువు ప్రతిష్టలకు బంగం కలిగించారు అంటూ ఈయన వీరిపై పరువు నష్టం దావా వేస్తానని మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు అయితే ఈయన పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మన్సూర్ కి గట్టి షాక్ ఇచ్చింది.

పబ్లిసిటీ కోసమే ఇలా..

మన్సూర్ అలీ ఖాన్ గురించి కోర్టు తీర్పును వెల్లడిస్తూ నిజానికి మీ పైనే త్రిష కేసు వేయాలని మీరు ఆమె పట్ల అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు తానే కేసు పెట్టాలని తీర్పు ప్రకటించింది . మీరు కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారంటే కోర్టు మందలించింది. అంతేకాకుండా ఆయన కేసు వేసినందుకు లక్ష రూపాయలపాటు జరిమానా కట్టాలని ఆ జరిమానాన్ని కూడా అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి అందజేయాలంటూ తీర్పు ఇస్తూ ఈ కేస్ కొట్టివేశారు.