Akash Puri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన వారసుడిగా ఆకాష్ పూరి కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే ఆకాష్ బాల నటుడు గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో హీరోల చిన్నప్పటి పాత్రలలో నటించారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ సక్సెస్ కోసం ఈయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చివరిగా ఆకాష్ చోర్ బజార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయిందని చెప్పాలి. ఇక ఆకాష్ కెరియర్ విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఆకాష్ తన చిన్ననాటి స్నేహితురాలు క్లాస్మేట్ అయినటువంటి అమ్మాయితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వీరిద్దరికీ పెళ్లి చేయడానికి నిశ్చయించారని తెలుస్తుంది. అయితే వీరి వివాహం వచ్చే ఏడాదిలో జరగబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
పొలిటిషియన్ మనవరాలు..
ఇక ఈయన ప్రేమించిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే ఈ అమ్మాయి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయని తెలుస్తుంది. ఈమె ఓ సీనియర్ పొలిటీషియన్ మనవరాలని సమాచారం. ఇక ఈమె ఒకటే కూతురని కొన్ని వందల కోట్లకు ఆస్తిపరురాలు అంటూ సోషల్ మీడియాలో ఆకాష్ ప్రేమ గురించి ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే ఈ విషయంపై వీరు అధికారక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…