salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించినటువంటి తాజా చిత్రం సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇలా ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సలార్ సినిమా ద్వారానే మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. ఈ వ్యవధిలో ఈయన నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇక ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ అద్భుతమైనటువంటి కలెక్షన్లను రాబడుతుంది. ఇక ప్రభాస్ ఖాతాలో మరో సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ చేరిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించారు. అయితే ఈ సినిమాకు మొదటి ఆప్షన్ శృతిహాసన్ కాదని తెలుస్తుంది.
ఈ సినిమాలో నటించడానికి ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ బాలీవుడ్ నటి అలియా భట్ ను ఎంపిక చేశారట. ఇదే విషయాన్ని ఆమె దగ్గరకు వెళ్లి ప్రస్తావించగా ఈమె మాత్రం కరాకండిగా నేను నటించను అని చెప్పేశారు. ఇలా ఈ సినిమాలో నటించడానికి అలియా భట్ ఒప్పుకోకపోవడంతోనే సెకండ్ ఆప్షన్ గా శృతిహాసన్ ని ఎంపిక చేశారని అలా ఈ సినిమాలో శృతిహాసన్ ఎంపిక అయ్యారని తెలుస్తోంది.
ప్రభాస్ సినిమాలపై నమ్మకం లేకే..
ఇక ఈ సినిమాలో నటించడానికి అలియా ఎందుకు ఒప్పుకోలేదు అనే విషయానికి వస్తే ఈ సినిమాలో ఈమె కనుక నటిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మార్కెట్ పరంగా తమకు కలిసి వస్తుంది అన్న ఆలోచనతోనే దర్శక నిర్మాతలు ఈమెను సంప్రదించారని తెలుస్తోంది. అయితే అప్పటికే ప్రభాస్ నటించిన వరుసగా సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో ఆయన సినిమా పై నమ్మకం లేక ఈమె ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అలియా అన్ లక్కీ హీరోయిన్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…