Mahashivaratri: మహాశివరాత్రి స్పెషల్ ఈ పాటలు తప్పకుండా వినాల్సిందే!

Mahashivaratri: మహాశివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు శివుడి పూజలో నిమగ్నమౌతూ ఆయన సేవలోనే ఉంటారు. ఇలా శివుడికి పూజ చేసిన తర్వాత శివుడికి సంబంధించిన సినిమాలను పాటలను వింటూ ఉంటారు. శివరాత్రి రోజు తప్పనిసరిగా వినాల్సిన శివుడి పాటలు ఏంటి అనే విషయానికి వస్తే…

ఓం మహా ప్రాణదీపం పాట శ్రీ మంజునాథ సినిమాలోనిది. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. అలాగే ఈ సినిమాలో శ్రీ పాదం అనే పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. ఇక జీవిత చిత్రాన్ని చూపించే పాటలలో అత్యంత ప్రజాదరణ పొందిన పాట ఆటగదరా శివ ఇది ఆటగద కేశవ అనే పాట కూడా ఎంతో ఆదరణ పొందింది.

ఇందులోని ప్రతి ఒక్క అక్షరం జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. ఇంత అద్భుతమైన ఈ పాటను తనికెళ్ళ భరణి రచించగా ఏసుదాసు ఈ పాటను ఆలపించారు. ఇక శివరాత్రి రోజు వినాల్సిన పాటలలో ఎట్టాగయ్య శివ శివ పాట ఒకటి ఇది కూడా శివరాత్రి రోజున వినాల్సిన పాటలలో ఒకటి.

Mahashivaratri: లింగాష్టకం శివరాత్రి ప్రత్యేకత…


జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోని భ్రమ అని తెలుసు అనే పాట కూడా ఎంతో ఆదరణ పొందింది బ్రతుకంటే బొమ్మలాట పుట్టుక మరణం తప్పదు అంటూ సాగిపోయే ఈ పాట ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక పరమానందయ్య శిష్యులు సినిమాలో ఓం మహాదేవ అనే పాట శివరాత్రి ప్రత్యేకమని చెప్పాలి. ఈ పాటను పి సుశీల పాడారు. ఇక లింగాష్టకం పాట కూడా శివరాత్రి స్పెషల్ సాంగ్ గా నిలిచిపోయింది.