Actor Rajasekhar: సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్లు విజయానికి మారుపేరుగా నిలుస్తుంటారు. అయితే కొన్నిసార్లు వారి అంచనాలు తప్పు అవుతూ డిజాస్టర్ సినిమాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న బి గోపాల్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు.
ఇక ఈ డైరెక్టర్ మహేష్ బాబు ప్రభాస్ సీనియర్ హీరో రాజశేఖర్ వంటి హీరోలకు మాత్రం డిజాస్టర్ సినిమాలను అందించారు. ఇకపోతే ఈయన రాజశేఖర్ హీరోగా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడం గమనార్హం. బి గోపాల్ దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన మొట్టమొదటి చిత్రం గ్యాంగ్ మాస్టర్.
రాజశేఖర్ నగ్మా హీరో హీరోయిన్లుగా గోపాల్ దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో మ్యూజికల్ హిట్ అయినప్పటికీ సినిమా మాత్రం హిట్ అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన తదుపరిచిత్రం రవన్న.
సూపర్ స్టార్ కృష్ణ ముఖ్యమైన పాత్రలో.. రాజ శేేఖర్, సౌందర్య హీరో హీరోయిన్లుగా.. సంఘవి, రక్ష, జయ ప్రకాష్ రెడ్డి, నర్రా తదితరులు నటించిన చిత్రం రవన్న.అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా చూసినటువంటి ఆడియన్స్ రవన్న…ఇదేం సినిమా అన్నా అంటూ వాపోయారు. ఇలా గోపాల్ దర్శకత్వంలో యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…