Mahasivarathri: మహాశివరాత్రి రోజున తప్పక చూడవలసిన సినిమాలు ఇవే!

Mahasivarathri: మహాశివరాత్రి అంటేనే అందరూ కూడా పెద్ద ఎత్తున శివుడిని పూజించి ఉపవాస జాగరణలు చేస్తూ ఉంటారు.ఇలా శివరాత్రి రోజు ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలతో పరమేశ్వరుడిని పూజించిన అనంతరం చాలామంది ఆ రోజు రాత్రి జాగరణ చేస్తూ ఆధ్యాత్మిక సినిమాలను చూస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఒకప్పుడు ఒకే టికెట్ పై రెండు మూడు సినిమాలనుచూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పించేవారు అయితే ప్రస్తుతం ఇంట్లోనే చాలామంది సినిమాలను చూస్తూ జాగరణ చేస్తూ ఉంటారు. మరి శివరాత్రి రోజు తప్పనిసరిగా చూడాల్సిన కొన్ని సినిమాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం…

భూకైలాస్:

ఎన్టీఆర్ ఏఎన్నార్ నాగభూషణం వంటి తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటికీ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో నాగభూషణం పరమశివుడి పాత్రలో నటించగా ఎన్టీఆర్ రావణాసురుడి పాత్రలోనూ ఏఎన్నార్ నారదుడిగానటించి మెప్పించారు ఎంతో అద్భుతమైన ఈ చిత్రం శివరాత్రి రోజు తప్పనిసరిగా చూడాల్సిన సినిమాలలో ఒకటి.

భక్తకన్నప్ప:

తెలుగు సినిమా ఇండస్ట్రీలో శివుడి పై వచ్చినటువంటి ఒక క్లాసికల్ సినిమాలో భక్తకన్నప్ప చిత్రం ఒకటి. ఇందులో కృష్ణంరాజు నటన అద్భుతం అని చెప్పాలి.

మహాశివరాత్రి:
రాజేంద్రప్రసాద్ సాయి కుమార్ మీనా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం మహాశివరాత్రి. శివయ్య మహత్యాన్ని తెలియజేసే ఈ సినిమాను శివరాత్రి రోజు తప్పనిసరిగా చూడాల్సిందే.

Mahasivarathri:

శ్రీ మంజునాథ:

శివరాత్రి అంటేనే తప్పనిసరిగా అందరి మదిలో మెలిగే చిత్రాలలో శ్రీ మంజునాథ ఒకటి. ఇందులో శివుడుగా చిరంజీవి నటన అద్భుతం ఇక ఈ సినిమాలో అర్జున్ నటన కూడా ఎంతో అద్భుతమైన చెప్పాలి.

జగద్గురు ఆదిశంకర:
ఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ‘జగద్గురు ఆదిశంకర’.. నాగార్జున, కౌశిక్ బాబు, మోహన్ బాబు, సుమన్, శ్రీహరి, మీనా, రోజా, కమిలినీ ముఖర్జీ తదితరులు నటించారు. శివరాత్రి పండుగ సందర్భంగా చూడాల్సిన సినిమాలలో జగద్గురు ఆదిశంకర చిత్రం కూడా ఒకటి.