Mannava koteswararo : నాగార్జున ను నేను తిట్టాలి కానీ ఆయన నా భుజం మీద చేయి వేసి ఒకటన్నారు… బాలయ్యబాబు ని ట్రోల్ల్స్ చేసే వారికి ఒకటే చెప్తున్నా : మన్నవ కోటేశ్వరరావు

Manava koteswararo : తెలుగు దర్శకుడు శంకర్ దర్శకత్వములో ‘ఎన్ కౌంటర్’ సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన కోటేశ్వరరావు గారు ఇటీవల యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఎన్ కౌంటర్ సినిమా తరువాత మళ్ళీ మోహన్ బాబు గారి సినిమాలే రాములయ్య, యమజాతకుడులో నటించినా, నాగేశ్వరరావు గారి సలహా మేరకు ఇతర సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పారు. సినిమాలకు ముందే వ్యాపారంలో అడుగుపెట్టిన కోటేశ్వరరావు గారు ఆ తరువాత సినిమాల వైపు వచ్చారు. ఇక నాగార్జున గారితో ‘కేడి’ సినిమాలో నటించే సమయంలో ఆయన అనుభవాలను పంచుకున్నారు.

నాగార్జునను చూసి భయమేసింది.. బాలకృష్ణ అలాంటివాడు…

కేడి సినిమాలో నాగార్జున గారితో తొలిసారి చేస్తున్నపుడు కాస్త భయపడ్డానని, అదీకాక నాగార్జున గారిని తిట్టే సన్నివేశం కావడంతో ఇంకాస్త ఇబ్బంది పడ్డానని చెప్పారు. అయితే నాగార్జున ఆ ఇబ్బందిని గమనించి ఏం పర్వాలేదు తిట్టండి నన్ను కాకుండా ఆ జూనియర్ ఆర్టిస్ట్ ని తిడుతున్నా అనుకోని తిట్టండి అని భుజం పై చేయి వేసి చెప్పారట. కానీ టేకులు తీసుకోవడంతో పర్వాలేదు టేకులు తీసుకుని కొంచెం ఫ్రీ అవ్వండి అంటూ ప్రోత్సహించారని ఆ సినిమా తరువాత ఇంకెక్కడా ఇబ్బంది పడలేదని చెప్పారు.

బాలకృష్ణ గురించి ఇప్పుడొస్తున్న కుర్రహీయోలు కూడా ఇమిటేట్ చేయడం, ఇక సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ గురించి మానవ కోటేశ్వరరావు గారు స్పందిస్తూ బాలకృష్ణ గారితో లెజెండ్ సినిమా అప్పుడు పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆయన చాల సరదాగా ఉంటారని, ఆహా లో వచ్చే అన్ స్టోపాబల్ షో లో ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో నిజంగా కూడా అలానే ఉంటారని చెప్పారు. ఆయనకు ఒకసారి ఎదుటివారు నచ్చితే ఇకంతే.. భోజనం దగ్గరినుండి అన్ని చూసుకుంటారు, చాలా సరదగా ఉంటారు అంటూ బాలకృష్ణ గురించి చెప్పారు. ఇక బోయపాటి గురించి చెబుతూ ఆర్టిస్టుల నుండి ఆయనకు ఏం కావాలో అది రాబట్టుకుంటారు అంటూ కితాబు ఇచ్చారు. సెట్స్ లో ఉంటే సినిమా గురించి తప్ప వేరే విషయాలు ఆలోచించకుండా ఉండేలా ఆయన మాటలతో మనల్ని ఆకట్టుకుని మన దగ్గర ఆయనకు కావల్సిన అవుట్ పుట్ తీసుకుంటారు అంటూ చెప్పారు.