Manchu Manoj: నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: మనోజ్

Manchu Manoj: మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి మనోజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మనోజ్ ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.

త్వరలోనే ఆంధ్రలో ఎన్నికలు జరగబోతున్నాయని అయితే మీరు ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఓటు వేయాలని ఎలా చెప్పారు ఎవరైతే మనతో పాటు మనకు తోడుగా నడుస్తారు. వారికే ఓటు వేయాలని తెలిపారు. దారుణాలకు పాల్పడేవారికి సొంత సభ్యులకే న్యాయం చేయలేకపోయే వారికి మాత్రం ఓటు వేయకండి అంటూ ఈయన చెప్పుకువచ్చారు.

మనోజ్ ఇలా ఎన్నికల గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈయన వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఓటు వేయద్దు అంటూ ప్రచారం చేశారు అంటూ పలువురు పెద్ద ఎత్తున ఈయనపై ట్రోల్స్ చేశారు ఇలా తన గురించి ట్రోల్స్ వస్తున్నటువంటి తరుణంలో మనోజ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. నాన్న పుట్టినరోజు వేడుకలలో భాగంగా నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి గురిచేశాయి అందుకే క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను అని తెలిపారు.

ఏ పార్టీతో నాకు సంబంధం లేదు..
ప్రతీది రాజకీయంగా చూడకుండా ఐక్యత, గౌరవంగా ముందుకు సాగాలనేది నా మాటల ఉద్దేశం. ఏదో ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఏ పార్టీతో నాకు సంబంధాలు లేవు. గొడవలు కూడా లేవు. నటుడిగా నన్ను నా కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ఈయన ఇష్యూ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.