Karthika Deepam 2: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటని చెప్పాలి. ఈ సీరియల్ సుమారు 1500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుని ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఇలా మంచి ఆదరణ లభించినటువంటి తరుణంలో కార్తీకదీపం 2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సినిమాకు సీక్వెల్స్ వచ్చాయి కానీ ఇలా సీరియల్ కి కూడా సీక్వెల్ రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు సినిమాలకు మాత్రమే ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించారు కానీ సీరియల్స్ చరిత్రలోనే మొదటిసారి కార్తీకదీపం 2 సీరియల్ ఫ్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి .ఈ వేడుకలలో భాగంగా డాక్టర్ బాబు పాత్రలో నటించినటువంటి నిరుపమ్, దీప పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ హాజరై సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు డాక్టర్ బాబు వంటలక్క ఇద్దరికీ కూడా హారతులు ఇచ్చి వారి అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం ఈ సీరియల్ గురించి వీరిద్దరూ మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సీరియల్ ఎప్పుడు ప్రసారమవుతుంది ఏ సమయానికి వస్తుంది అనే విషయాలను కూడా వెల్లడించారు.
మార్చి 25న ప్రారంభం..
మార్చి 25వ తేదీ నుంచి ఈ సీరియల్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుందని తెలిపారు. ఇలా సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ ప్రసారం కానుందని తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…