Medico Preethi Sucide : ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ లో అసలు ఏముంది… కన్నుకి టేపు ఎందుకు వేసారు…: ప్రీతి తమ్ముడు పృథ్వీ

Medico Preethi Sucide: కాకతీయ యూనివర్సిటీ లో పీజీ చేస్తున్న డాక్టర్ ప్రీతి అనే యువతి గత బుధవారం డ్యూటీలో ఉండగానే హానికర ఇంజక్షన్ ను వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. వరంగల్ లో మెడిసిన్ అనస్థిషియా పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను భరించలేక ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం నాడు ప్రీతి ఆత్మహత్యా యత్నం చేయగా గురువారం నాడు పీజీ రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు ఇచ్చే డిపార్ట్మెంట్ లో డ్యూటీ నిర్వహిస్తున్న ప్రీతి అక్కడే ఉన్న ప్రమాదకర ఇంజక్షన్ ను వేసుకుంది. మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరకు ఓడిపోయింది. ఆమెది ఆత్మహత్య కాదు కాలేజీలో ఏదో జరిగింది అంటూ ప్రీతి కుటుంబం ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం ర్యాంగింగ్ కు బలైంది. తాజాగా ఆమె టాక్సికాలజీ రిపోర్ట్ వెలువడింది.

రిపోర్ట్ వచ్చినట్లు ప్రీతి కుటుంబానికి తెలియదు…

ప్రీతి ఆత్మహత్య కేసులో మొదటి నుండి ఆమెది ఆత్మహత్య కాదు హత్య అంటూ ప్రీతి కుటుంబం ఆరోపిస్తుండగా తాజాగా ఆమె శరీరంలో విషపూరిత పదార్థాలు ఏమైనా ఉన్నాయా, అవి ఎంత మోతాదులో ఉన్నాయి అనే విషయాలను ప్రీతి రక్తం పరీక్షకు పంపారు. తాజాగా ఆ టాక్సికాలజీ రిపోర్ట్ లో ప్రీతి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలలో ఎలాంటి విషపూరిత పదార్థాలు దొరకలేదనే రిపోర్ట్ రావడంతో ప్రీతి తమ్ముడు పృథ్వీ యూట్యూబ్ లో ఒక ఛానెల్ తో మాట్లాడుతూ అసలు టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చినట్లు కూడా మాకు తెలియదని మీడియాలో చూసాకే తెలిసిందని చెప్పారు. ఈ విషయం మీద డిజిపి ని కలిసినా పెద్దగా ప్రయోజనం కలగలేదని చెప్పారు. పృథ్వీ మాట్లాడుతూ మా అక్కను నిమ్స్ కు 23 తెల్లవారుజామున తరలించినప్పటికే తనకు ప్రాణం పోయింది. కానీ వాళ్ళు నిమ్స్ కి తరలించి మొత్తం అక్క బాడీలోని రక్తం క్లీన్ చేసారు. వరంగల్ నుండి నిమ్స్ కి తరలించే సమయంలో కంటికి ప్లాస్టర్ వేశారు. అది ఎందుకు వేసారో చెప్పలేదు. తనను వెంటిలేటర్ మీద ఉంచి ఏక్మొ చేస్తున్నట్లు చెప్పడంతో ఏదైనా జరగవచ్చని మా నాన్నతో సంతకం పెట్టించుకున్నారు.

24వ తేదీన ఏక్మొ పెట్టించేటప్పుడు ఏక్మొ ఇన్ లెట్ వద్ద బ్లడ్ తీసి దాన్ని టాక్సికాలజీ టెస్టుకి పంపారు. ఏక్మొలో పంపించే రక్తం బయటి నుండి తెచ్చినది. అప్పటికే అక్కకు బయటి రక్తం దాదాపు 7 యూనిట్స్ ఎక్కించారు. ప్లాస్మా, రక్తం, ప్లేట్ లేట్స్ దాదాపు అన్నీ 6 నుండి 7 యూనిట్ల వరకు తెచ్చాము. నేనే తెచ్చి ఇచ్చాను. మా అక్క శరీరం మొత్తం రక్తం మార్చి క్లీన్ చేసారు. ఇక బయటి రక్తం ఎక్కించి టెస్టు చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది. ఎవరిని కాపాడటానికి ఇవన్నీ చేస్తున్నారు. వరంగల్ లో హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్ తీసారని మాకు తెలుసు కానీ ఆ రిపోర్ట్స్ ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. అసలు వరంగల్ నుండి నిమ్స్ కి తరలించిన తరువాత అసలు ఏమి చికిత్స ఇచ్చారో మాకు చెప్పలేదు అంటూ ఆరోపించారు పృథ్వీ.