Featured

Khushbu : మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు… ఎమోషనల్ అయిన నటి ఖుష్బూ…!

Khushbu : తెలుగులో ‘కలియుగ పాండవులు’ సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ ఖుష్బూ. అప్పటికే తమిళంలో హీరోయిన్ గా చేసినా తెలుగులో ఖుష్బూ తొలి సినిమా వెంకటేష్ తో నటించిన కలియుగ పాండవులే. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన ఖుష్బూ సౌత్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది. ఇక సినిమాల్లో నుండి కెరీర్ ను రాజకీయాల వైపు షిఫ్ట్ చేసిన ఖుష్బూ సినిమా డైరెక్టర్ సుందర్ నే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్న ఖుష్బూ అటు పాలిటిక్స్ లో ఉంటూనే ఇటు టీవీ షోస్ లో జడ్జిగా కూడా వ్యవహారిస్తోంది. తాజాగా లైంగిక వేధింపులను నేను ఎదుర్కొన్నాను అంటూ మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచారు.

మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు…

ఖుష్బూ ప్రస్తుతం బీజేపీ పార్టీ తరుపున తమిళనాడులో కీలకంగా వ్యవహారిస్తున్నారు. జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా ఉన్న ఖుష్బూ గారు మహిళా దినోత్సవం సందర్బంగా లైంగిక వేధింపులు, చిన్నపిల్లల మీద దాడులను గురించి మాట్లాడారు. ఆ సమయంలో ఖుష్బూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నపుడు తన తండ్రి వల్ల లైంగిక వేధింపులకు లోనయ్యానని చెప్పి షాక్ ఇచ్చారు.

తన తండ్రి తనను లైంగికంగా వేధించారని, ఈ విషయం తల్లితో చెబితే నమ్ముతుందో లేదో అని భయం వేసిందని ఎందుకంటే తన తల్లికి భర్తే సర్వస్వం అన్నట్లుగా ఉండేదని చెప్పారు. ఇక పదిహేడేళ్ల సమయంలో తండ్రిపై తిరగబడటంతో అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడని, మేము అప్పట్లో చాలా కష్టాలు పడ్డామని తెలిపారు ఖుష్బూ.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago