LR Eswari: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమాలోని ఉ అంటవా మామ అనే స్పెషల్ సాంగ్ ఎంతగా ఆదరణ పొందిందో మనకు తెలిసిందే. డిఎస్పి సంగీత సారథ్యంలో ఇంద్రావతి చౌహన్ పాడినటువంటి ఈ పాటకు సమంత స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఈ పాట ద్వారా సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇక ఈ పాట అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాని షేక్ చేసిందని చెప్పాలి. ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ పాట గురించి సింగర్ ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె పుష్ప సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అప్పట్లో తాము పాడే పాటలకు ఎంతో మంచి ఆదరణ ఉండేదని ఇప్పటికీ కూడా ఆ పాటలు నిలుస్తున్నాయి అంటే ఆ పాటలు ఎంతో గొప్పగా ఉండేవని తెలిపారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పాటలకు పెద్దగా ఆదరణ లేదని ఈమె తెలియజేశారు. గత కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి ఉ అంటావా మామ ఊ..ఊ అంటావా మావ అనే పాట విన్నాను అసలు అది కూడా ఓ పాటేనా అంటూ ఈమె కామెంట్ చేశారు.
ఈ పాట మొదటి నుంచి చివరి వరకు ఒకే విధంగా ఉంది కనీసం మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఈ విషయం చూసుకోవాలి కదా.. పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు చెప్పిన విధంగా పాడతారు. ఆ పాటే కనుక నా దగ్గరకు వచ్చి ఉంటే మరోలా ఉండేదని ఈ సందర్భంగా ఈశ్వరి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…