Upasana Konidela: 150 వృద్ధాశ్రమాలకు సాయం అందించి మంచి మనసు చాటుకున్న మెగా కోడలు!

Upasana Konidela: మెగా కోడలిగా ఉపాసన ఎన్నో బరువు బాధ్యతలను తన భుజాలపై వేసుకొని ఎంతో చక్కగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను చక్కగా నిర్వహించడమే కాకుండా మెగా కుటుంబ కోడలిగా ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వహిస్తూ మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ వస్తున్నారు.

Upasana Konidela: 150 వృద్ధాశ్రమాలకు సాయం అందించి మంచి మనసు చాటుకున్న మెగా కోడలు!

ఇలా ఇంటి బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న ఉపాసన సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా ముందు వరుసలో ఉంటారు.ఇప్పటికే ఎన్నో మూగజీవాలను దత్తత తీసుకొని వాటి సంరక్షణ చేపట్టిన ఉపాసన తాజాగా 150 వృద్ధాశ్రమాలకు తన వంతు సహాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు.

Upasana Konidela: 150 వృద్ధాశ్రమాలకు సాయం అందించి మంచి మనసు చాటుకున్న మెగా కోడలు!

బిలియన్ హార్ట్స్ బీటింగ్ అనే ఫౌండేషన్‌తో కలిసి ఉపాసన ఈ గొప్ప గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇలా తన వంతుగా వృద్ధాశ్రమాలకు సహాయం చేస్తూ వృద్ధులతో కలిసి సంతోషంగా గడుపుతున్నటువంటి క్షణాలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు మెగా కోడలు మనసు బంగారం అంటూ తన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఏ మాత్రం తగ్గని మెగా కోడలు…

ఈ విధంగా సామాజిక కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొనే ఉపాసన ఆరోగ్య విషయాల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇక కరోనా సమయంలో ఈమె ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి తన వంతు సహాయం చేసే అందరి ప్రశంసలు అందుకున్నారు.