Upasana Konidela: మెగా కోడలిగా ఉపాసన ఎన్నో బరువు బాధ్యతలను తన భుజాలపై వేసుకొని ఎంతో చక్కగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను చక్కగా నిర్వహించడమే కాకుండా మెగా కుటుంబ కోడలిగా ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వహిస్తూ మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ వస్తున్నారు.
ఇలా ఇంటి బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న ఉపాసన సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా ముందు వరుసలో ఉంటారు.ఇప్పటికే ఎన్నో మూగజీవాలను దత్తత తీసుకొని వాటి సంరక్షణ చేపట్టిన ఉపాసన తాజాగా 150 వృద్ధాశ్రమాలకు తన వంతు సహాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు.
బిలియన్ హార్ట్స్ బీటింగ్ అనే ఫౌండేషన్‌తో కలిసి ఉపాసన ఈ గొప్ప గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇలా తన వంతుగా వృద్ధాశ్రమాలకు సహాయం చేస్తూ వృద్ధులతో కలిసి సంతోషంగా గడుపుతున్నటువంటి క్షణాలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు మెగా కోడలు మనసు బంగారం అంటూ తన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ విధంగా సామాజిక కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొనే ఉపాసన ఆరోగ్య విషయాల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇక కరోనా సమయంలో ఈమె ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి తన వంతు సహాయం చేసే అందరి ప్రశంసలు అందుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…