‘ఆచార్య’ ను పూర్తిగా ఆపేసిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..??

ఈ కరోనా మొదటి వేవ్ తోఇప్పటికే సంవత్సర కాలం సినిమాలు లేకుండా.. షూటింగులు సాగకుండా ఇండస్ట్రీ మొత్తం అష్టకష్టాలు పడింది. గత జనవరి నుంచి మళ్లీ సినిమాలు విడుదలై క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, వకీల్ సాబ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీ కళకళలాడుతోంది.ఇలాంంటి సమయంలో సెకండ్ వేవ్ వచ్చి మరోసారి సినిమా ఇండస్ట్రీని కోలుకోకుండా చేస్తోంది.తాజాగా కరోనా ఎఫెక్ట్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీపై కూడా పడింది.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య మూవీ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ను నిరవధికంగా వాయిదా వేసినట్టు సమాచారం. కరోనా ఉన్న ఆగకుండా సాగుతున్న వీరి షూటింగ్ కు తాజాగా బ్రేక్ పడింది.కొన్ని రోజుల క్రితం.. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న ప్రముఖ నటుడు సోను సూద్ కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆచార్య షూట్ షెడ్యూల్ సాగుతుందా? లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. హైదరాబాద్ పరిసరాల్లో కరోనా వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆచార్య షూట్ ను పూర్తిగా నిలిపివేసినట్టు తెలిసింది. షూట్‌ను వాయిదా వేశారని.. కరోనా పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత తిరిగి షూటింగ్ జరుగుతుందని సమాచారం. అంటే ప్రస్తుతానికి పూర్తిగా ఆచార్య ఆగిపోయినట్టే లెక్క.

మళ్లీ కరోనా ఎప్పుడు పోతుందా? షూటింగ్ లు ఎప్పుడు నడుస్తాయో తెలియని పరిస్థితి. అప్పటికానీ ఈ సినిమా షూటింగ్ జరగదు.కొణిదెల ప్రొడక్షన్.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లలో నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు..దీంతో ఆచార్య టీమ్ సినిమా విడుదలను వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. త్వరలోనే దీనికి సంబంధించి మేకర్స్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం…!!