సాధారణంగా ఉద్యోగం చేసే వారిలో వారి జీవితం నుంచి కొంత భాగం పీఎఫ్ అకౌంట్లో జమవుతూ వస్తుంది. ఈ విధంగా పీఎఫ్ అకౌంట్ లో జమయిన డబ్బులు రిటైర్మెంట్ తర్వాత తీసుకోవచ్చు లేదా అత్యవసర పరిస్థితులలో మనం ఆ డబ్బులను మధ్యలో కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బులు డ్రా చేసుకోవడానికి సరైన కారణం ఉండాలి.
అయితే కొందరు కొన్నిసార్లు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి వెళ్తుంటారు.అలాంటప్పుడు కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్ కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ పీఎఫ్ అకౌంట్ కంటిన్యూ కావాలంటే కచ్చితంగా ఒక పని చేయాల్సి ఉంటుంది.ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించిన ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోలేరు లేదా విత్ డ్రా కూడా చేసుకోలేరు.
మన పాత పీఎఫ్ అకౌంట్ కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ కావాలంటే మనం జాబ్ మానేసిన ఎగ్జిట్ తేదీని
ఈపీఎఫ్‌వో సిస్టమ్‌లో ఎంటర్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మనం డబ్బులను విత్డ్ డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈ విధంగా ఎగ్జిట్ తేదీని ఎంటర్ చేయడానికి కంపెనీ పై ఆధారపడాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ఎగ్జిట్ నెంబర్ ను మనమే ఎంటర్ చేసుకోవచ్చు.
మనం జాబ్ మానేసిన రెండు నెలల తర్వాత మాత్రమే ఈ ఎగ్జిట్ నెంబర్ ను ఈపీఎఫ్‌వో సిస్టమ్‌లో ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఈపీఎఫ్‌వో వెబ్ సైట్ కు వెళ్ళి లాగిన్ అయి, మేనేజ్ ఆప్షన్ లోకి వెళ్ళాలి. అక్కడ మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని పై క్లిక్ చేసి డేట్ అఫ్ ఎగ్జిట్ కొడితే మనకు ఓటిపి వస్తుంది. ఓటిపిని ఎంటర్ చేస్తే మన పీఎఫ్ అకౌంట్ కొత్త కంపెనీ కి ట్రాన్స్ఫర్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…