ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా స్టార్ గా కూడా మారుతున్నారు యూజర్లు. ఇక ఒకప్పుడు బ్యాన్ చేసిన టిక్ టాక్ యాప్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ప్రతి ఒక్కరు తమ డాన్స్ వీడియోలతో స్టార్స్ గా మారారు. ఇదిలా ఉంటే ఓ మై గాడ్ ఓ మై గాడ్ అనిపించే టిక్ టాక్ లో స్టార్ గా మారిన ఫన్ బకెట్ భార్గవ్ గురించి అందరికీ తెలిసిందే. తన వీడియోలతో తెగ ఫేమస్ గా మారిన ఈయనపై.. రేప్ కేసు నమోదయింది. అంతేకాకుండా అరెస్టు చేశారని మరో యూట్యూబ్ యాంకర్ శివ తెగ పోస్టులను చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎటువంటి క్లారిటీ లేకపోగా.. బహుశా ఇది ఫ్రాంక్ వీడియో గా చేస్తున్నారేమోనని అనుమానం రాగా మొత్తానికి ఈ విషయం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. యాంకర్ శివ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ తెగ పాపులర్ సంపాదించుకున్నాడు. ఇక ఇది కూడా అలాగే అనుకోగా.. శివ చేసిన పోస్టులు మాత్రం కాస్త ఆసక్తిగా అనిపించాయి.
తాజాగా యాంకర్ శివ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో..’ నాకు ఒకటి అర్థం కాదు.. ఈరోజు దిశ చట్టం అంటే ఎవరికీ తెలియలేదు చూశారా? గొప్పోల్రా బాబు.. ఉండాల్సిన వాళ్లే.. మీరా నాకు కామెంట్స్ పెట్టారు. నిజాలు చెప్తుంటే ఫ్రాంక్ అంటారు. ఏంట్రా నాయనా.. వాళ్లతో నేను ఎందుకు ఫ్రాంక్ చేస్తా.. మీరు మారరు. పోలీసుల నుంచి నాకు ఫోన్ వచ్చింది. పోస్ట్ డిలీట్ చేయమని. ఎందుకంటే వాళ్ల ఫేసులు కనిపించకూడదట. రేపు వాళ్ళ అఫీషియల్ గా చేస్తామని నాతో చెప్పారు’ అని పోస్ట్ చేశాడు.
ఇక ఈ పోస్ట్ చూడగా ఎవరికీ ఏమీ అర్థం కాక, యాంకర్ శివ తో ఫన్ బకెట్ భార్గవ్ కు ఏమైనా గొడవలు ఉన్నాయా లేదా ఏవైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నాడా అని కామెంట్లు వస్తున్నాయి. అంతేకాకుండా ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా ఓ వీడియో కూడా వైరల్ గా మారగా.. అందులో ఉన్న వ్యక్తి ఫన్ బకెట్ భార్గవ్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, పోస్టులు తెగ వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…